శివశంకరప్పపై ప్రజల విశ్వాసం: 92 ఏళ్ల వయస్సులోనూ పోటీ చేసి గెలుపు, 4వసారి రికార్డు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారం ఖాయం చేసుకుంది. 224 సీట్లు కలిగిన కర్ణాటక అసెంబ్లీలో 135కుపైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 60కిపైగా స్థానాలతో రెండో స్థానంలో బీజేపీ, 20కిపైగా స్థానాలు దక్కించుకున్న జేడీఎస్ మూడో స్థానంలో నిలిచాయి. కాగా, ఈ ఎన్నికల్లో అత్యంత వయోవృద్ధుడైన కంగ్రెస్ అభ్యర్థి శామనూరు శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగరవేసి రికార్డు సృష్టించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత అయిన శివ శంకరప్ప.. దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన వయస్సు 92 ఏళ్లు కావడం గమనార్హం. ఈ వయస్సులో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది. ఎంతో ఉత్సవాహంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన మరోసారి గెలుపు బావుటా ఎగురవేశారు.

Karnataka results

శామనూరు శివశంకరప్ప రాజకీయ ప్రస్థానం గమనించినట్లయితే..

1994లో శివశంకరప్ప రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1994లో దావణగెరె మునిసిపల్ కౌన్సిల్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1994లోనే దావణగెరె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1997లో లోక్​సభ ఎన్నికల్లో గెలిచారు. 1999లో లోక్​సభ ఎన్నికలకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో దావణగెరె ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందారు. 2008, 2013, 2018 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు దావణగెరె దక్షిణ ఎమ్మెల్యేగా విజయం సాధించారు శంకరప్ప.

ఇక 2023లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. దావణగెరె దక్షిణ నియోజకవర్గం శామనూరు శివశంకరప్ప వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008లో దావణగెరె నియోజకవర్గాన్ని దావణగెరె దక్షిణగా విడదీశారు. మొత్తంగా దావణగెరె నగరం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం విశేషం. ఇలా వరుస విజయాలతో దావణగెరె దక్షిణ ప్రజలపై మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు శివశంకరప్ప. 'నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాపై ఉన్నాయి. నా వయసు 90 ఏళ్లు దాటినప్పటికీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఈసారి కూడా మళ్లీ నేనే గెలిచి చరిత్ర సృష్టిస్తా' అని ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఇప్పుడు విజయం కూడా సాధించారు.

Karnataka results

మరోవైపు, శంకరప్పకు పోటీగా నిలబడ్డ బీజేపీ అభ్యర్థి బీజీ అజయ్‌కుమార్‌​కు ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లతో మంచి అనుబంధమే ఉంది. కానీ, శివశంకరప్పకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో విజయకుమార్​‌ను బరిలోకి దింపిన గెలిపించుకోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+