కర్ణాటక ఫలితాలు: జోష్ లో కాంగ్రెస్... బాధలో సిద్ధరామయ్య; ఆయన ఇంట తీవ్ర విషాదం !!

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతోంది. కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మంచి జోష్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 120 స్థానాలకు పైగా మెజార్టీ లో ముందుకు వెళుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్న వేళ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సిద్ధరామయ్య ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం, సీఎం రేస్ లో ఉన్న సిద్దరామయ్య ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఈరోజు ఉదయం రామేగౌడ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటిన మైసూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. సిద్దరామయ్య ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Karnataka Results

ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికలలో అధికారం దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకు వెళ్తున్న వేళ సంతోషం అటునుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మాత్రం తలనొప్పి తప్పేలా కనిపించడం లేదు. అక్కడ సీఎం ఎవరిని చేయాలన్న టెన్షన్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ పడుతున్నారు.

వీరిలో ఎవరో ఒకరిని ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం భావిస్తోంది.ఇరువురు నేతలు బలమైన నాయకులు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుందో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక మరోవైపు ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు రంగం సిద్ధం చేసుకుంది. తమ పార్టీ నుండి గెలిచే వారిని కాపాడుకునే పనిలో పడింది.

Karnataka Results

ఇక తాజాగా కౌంటింగ్ సరళిని బట్టి జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ ప్లాన్ బీ అమలు చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా జేడీఎస్ అధినేత కుమారస్వామితో మంతనాలు జరుపుతుంది. అలాగే కాంగ్రెస్ నుండి బీజేపీ వైపు వచ్చే నాయకులను ట్రాప్ చేసే పనిలో పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+