క్రైమ్ కథా చిత్రమ్:వందల సంఖ్యలో అమ్మాయిలను పాతిపెట్టిన ఆ ఉద్యోగి..!!
ఇది ఒళ్లు గొగుర్పొడిచే ఘటన. దాదాపు దశాబ్దకాలం కిందట జరిగిన ఘోరమైన ఘటన. ఇప్పుడు పశ్చాత్తాపంతో బయట పెట్టిన ఘటన. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ రాష్ట్రం. ఇంతకీ ఆ ఘటనేంటి.. ఎక్కడ జరిగింది.. దశాబ్దాల తర్వాత ఎందుకు బయటపడింది.. తెలియాలంటే ఈ క్రైమ్ కథా చిత్రం చదవాల్సిందే.
అది కర్నాటక రాష్ట్రం ధర్మస్థల.. ధర్మస్థల అంటే గుర్తుకొచ్చేది ఆధ్యాత్మిక ప్రాంతం. ఇక్కడ మంజునాథుడు కొలువై ఉంటారు. ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో ఒక ఘోరం వెలుగు చూసింది. అది కూడా దశాబ్ద కాలం తర్వాత. ఆ నేరంలో భాగం పంచుకున్న ఓ వ్యక్తి బయటపెట్టిన వివరాలు తెలిస్తే షాక్‌కు గురవుతారు. ఇప్పుడు ధర్మస్థల గ్రామం కూడా ఇదే షాక్‌లో ఉంది. భయపడుతోంది. ఇక అసలు విషయానికి వద్దాం.

దశాబ్దం క్రితం జరిగిన ఘోరమైన నేరం
కర్నాటకలో ఓ మాజీ శానిటేషన్ వర్కర్ (పారిశుద్ధ్య కార్మికుడు) దశాబ్దాల క్రితం జరిగిన ఒక నేర సంఘటన గురించి వివరాలు తెలిపాడు.ఆ నేరాలు ఘారాలకు సంబంధించి లేఖ రాసి తన అడ్వకేట్ ద్వారా విడుదల చేశాడు. ఆ లేఖను నేరుగా పోలీసులకు అందజేశాడు. ఆ లెటర్ చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దశాబ్దకాలం క్రితం తను కొన్ని మృతదేహాలను ధర్మస్థల గ్రామం చుట్టూ పాతిపెట్టిన నిజం గురించి బయటకు చెప్పాడు.ఆ చనిపోయినవారంతా హత్యచేయబడ్డవారే. అయితే ఎవరు హత్య చేశారనేది మాత్రం ఈ శానిటేషన్ వర్కర్‌కు తెలీదట.
కొన్ని వందల మృతదేహాలను పాతిపెట్టా
1995 నుంచి 2014 వరకు ధర్మస్థలలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసినట్లు చెప్పిన ఆ వ్యక్తి... భద్రతా కారణాల వల్ల తన ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని భావించి తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు. నాడు కొందరు వ్యక్తులు ఘోరంగా మనుషులను హత్య చేసి చంపారని అందుకు తానే సాక్షమని లేఖలో వివరించాడు. చనిపోయిన వారిని తానే బలవంతంగా పాతిపెట్టాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు. ఇలా కొన్ని వందల మృతదేహాలను తానే పూడ్చినట్టు వెల్లడించాడు.అంతేకాదు తానే మృతదేహాలను డిస్పోజ్ చేయాలని బలవంతం చేశారని స్పష్టం చేశాడు.
మృతుల్లో ఎక్కువగా అమ్మాయిలే
ఇక 2014 తర్వాత ఆ శానిటైజేషన్ వర్కర్ ధర్మస్థలను వీడి ప్రాణభయంతో మరో రాష్ట్రానికి పారిపోయాడు.తనకు పోలీసు శాఖ రక్షణ కల్పిస్తే తాను చూసిన హత్యలు, హత్య చేసిన వారి వివరాలను వెల్లడిస్తానని లేఖలో పేర్కొన్నాడు.ఈ హత్యల వెనుక బడా బాబుల హస్తం కచ్చితంగా ఉందనే అనుమానం వ్యక్తం చేశాడు. అంతేకాదు మృతదేహాలను వెలికి తీసి అనుమానిత మరణాలపై దర్యాప్తు జరపాలని లేఖలో పోలీసువారిని అభ్యర్థించారు. ఇక ఇందులో సంచలన విషయం ఏంటంటే తాను పాతిపెట్టిన కొన్ని వందల మృతదేహాల్లో ఎక్కువగా యవ్వన వయస్సులో ఉన్న మహిళలవే అని చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.అమ్మాయిలపై లైంగిక దాడి చేసి ఆపై గొంతు నొక్కి చంపేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశాడు.
పాపం నన్ను వెంటాడుతోంది
ఈ ఘోర పాపాన్ని తాను మూటగట్టుకున్నట్లు చెప్పిన శానిటేషన్ వర్కర్.. తనను కొన్నేళ్లుగా ఈ పాపం వెంటాడుతోందని చెప్పాడు. చనిపోయిన వారికి మళ్లీ అంత్యక్రియలు నిర్వహించి గౌరవంగా వారిని సాగనంపాలని కోరాడు. అలా అయితేనే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని తాను కూడా ప్రశాంతంగా ఉండగలుగుతానని వెల్లడించాడు.లేఖను పూర్తిగా చదివిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సమగ్ర దర్యాప్తును నిర్వహిస్తామని చెప్పిన పోలీసు శాఖ.. కోర్టు అనుమతితో మృతదేహాలను వెలికి తీస్తామని వెల్లడించారు.
మొత్తానికి ఆ శానిటైజేషన్ వర్కర్ బయటపెట్టిన లేఖతో కర్నాటక రాష్ట్రం ముఖ్యంగా దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల గ్రామం ఒక్కసారిగా భయంతో వణికిపోయింది.












Click it and Unblock the Notifications