ఆమెతో మిత్రుడిగానే మాట్లాడా: సదానంద తనయుడు

స్నేహితుల ద్వారా మైత్రేయి తనకు పరిచయమైందని, మూడు నాలుగు పార్టీల్లో తాము మాట్లాడుకున్నామని, తర్వాత స్నేహంగా మారిందని ఆయన వివరించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం కార్తిక గౌడను అంబేడ్కర్ వైద్య కళాశాలకు తీసుకుని వెళ్లారు.
పసుపు కొమ్ముతో తాళి కట్టి తాను వివాహమాడినట్లు మేత్రేయి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్నేహితులుగా ఫోనులో మాట్లాడుకున్న విషయాలను రికార్డు చేసుకుని మైత్రేయి కట్టుకథలు అల్లుతోందని ఆయన ఆరోపించారు. మంగళూర్‌కు పిలిపించుకున్నానని, తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత మిత్రులకు ఆమెను పరిచయం చేశానని అంటున్నవనీ అబద్ధాలేనని కార్తిక్ గౌడ చెప్పారు.
న్యాయవాదులను వెంటబెట్టుకుని కార్తిక్ గౌడ పోలీసుల ముందుకు వచ్చారు. తాను మైత్రేయిని పెళ్లి చేసుకోలేదని, ఆమెను మోసం చేయలేదని ఆయన చెప్పారు. తన తండ్రి ప్రతిష్టను దెబ్బ తీయడానికే మైత్రేయి కట్టుకథలు అల్లుతోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications