వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా వారసుడు స్టాలినే... అధ్యక్ష పదవికి ఇంకా టైముంది: కరుణానిధి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరోసారి స్పష్టం చేశారు. ఐతే, పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు మరికొంత కాలం ఆగాలని కరుణానిధి నుంచి సంకేతాలు వచ్చినట్లు స్టాలిన్ క్యాంపు వర్గాల ద్వారా తెలుస్తోంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

దీంతో, రెండు రోజుల్లో జరగనున్న పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో స్టాలిన్‌కు అధ్యక్ష పదవి దక్కదని స్పష్టమైంది. డీఎంకేకు 12వ సారి అధ్యక్షుడిగా కరుణానిధి ఎంపిక శుక్రవారం నాడు జరగనుంది. తనయుడు స్టాలిన్ మరోసారి పార్టీ కార్యదర్శిగా కొనసాగనున్నారు.

Karunanidhi elected 12th time of DMK president

ఇక తాను అధ్యక్ష పదవి కోసం తొందరపడుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన స్టాలిన్ ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. డీఎంకే సంస్థాగత ఎన్నికల పర్వం విజయవంతంగా చివరి దశకు చేరిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

ఇక, పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవికి ఎన్నికలు జరగాల్సి ఉందన్నా రు. ఈ ఎన్నికల్లో తాను ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నట్టుగా సాగుతున్న ప్రచారాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీకి అధ్యక్షుడిగా కరుణానిధి, ప్రధాన కార్యదర్శిగా అన్భళగన్, కోశాధికారిగా తాను మళ్లీ పోటీ చేయబోతున్నామని వివరించారు.

ఐతే పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ వయోభారంతో పదవి నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ పదవి స్టాలిన్‌కు దక్కవచ్చన్న ఆశాభావంతో ఆయన మద్దతుదారులు ఉన్నారు. ఈ విషయంపై అధ్యక్షుడు కరుణానిధితో స్టాలిన్ మంతనాలు జరిపినట్టు, ఇందుకు ఆయన నిరాకరించినట్టు తెలుస్తోంది.

కరుణానిధి ఆజ్ఞను ధిక్కరించి ప్రధాన కార్యదర్శి పదవికి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేయడంతో పాటుగా, పార్టీ కోశాధికారి పదవికి రాజీనామా చేసినట్టుగా కొన్ని మీడియాలో వార్తా కథనాలు రావడం డీఎంకే పార్టీలో కలకలం రేపింది.

English summary
In a clear indication that DMK treasurer M K Stalin will not be elevated to a higher post in the party, the youth wing leader on Sunday said nomination forms for the treasurer post were already obtained from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X