జయలలిత సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియలు, ఆ ఇద్దరికి మధ్య
చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రిగా పనిచేసిన జయలలిత సమాధి పక్కనే కరుణానిధిని ఖననం చేయనున్నారు.
కలైంజ్ఞర్ నేతలు, సిినీ ప్రముఖుల నివాళి (పిక్చర్స్)
మెరీనా బీచ్‌లో మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలితల సమాధులు ఉన్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కరుణానిధి అంత్యక్రియలు కూడా మెరీనాలో నిర్వహిస్తున్నారు. కరుణ రాజకీయ గురువు, డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై, తన రాజకీయ ప్రత్యర్థి జయలలితల సమాధుల మధ్యలో కరుణానిధి సమాధి ఉండనుంది. డీఎంకే కోర్టుకు అందించిన సమాధి నమూనా ప్రణాళికలో అలాగే ఉంది.

కాగా, తొలుత అన్నాడీఎంకే ప్రభుత్వం మెరీనా బీచ్‌లో కరుణ అంత్యక్రియలకు అనుమతివ్వలేదు. మాజీ ముఖ్యమంత్రులకు స్థలం కేటాయించలేమని తెలిపింది. గాంధీ మండపం సమీపంలో రెండెకరాల స్థలం ఇచ్చింది. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా వాద ప్రతివాదనల విన్న అనంతరం కోర్టు కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించాలని, అందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని ఆదేశించింది.
కరుణానిధి అంతిమయాత్ర కొనసాగుతోంది. కరుణానిధి అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు డెరిక్ ఒబ్రెయిన్ హాజరయ్యారు. డీఎంకే కార్యకర్తలు వంద అడుగులు కరుణానిధి బ్యానర్‌తో అంతిమయాత్రలో పాల్గొన్నారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications