వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ అందం, బెంగాల్ సంస్కృతి, కేరళ మాదిరిగా విద్య పొందడంతో యూపీ లక్కీ: శశిథరూర్

|
Google Oneindia TeluguNews

యూపీ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల వేళ నిన్న సీఎం యోగి ఆదిత్య నాథ్ తేనెతుట్టేను కదిలించారు. యూపీ మరో కేరళ కావొద్దని కామెంట్ చేయగా.. వెంటనే కేరళ సీఎం పినరయి విజయన్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ వంతు వచ్చింది. యూపీ మరో కశ్మీర్, కేరళ, బెంగాల్ కావొద్దు అని యోగి అనగా.. ఉత్తరప్రదేశ్ లక్కీ అంటూ థరూర్ కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ అందం, బెంగాల్ సంసృతి, కేరళ విద్యతో యూపీ అద్భుతంగా మారుతుందని కామెంట్ చేశారు.

ఆలోచించి ఓటు వేయాలని.. లేదంటే యూపీ మరో కేరళ అవుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. కేరళ ఆదర్శ రాష్ట్రం అని చెప్పారు. అంతేకాదు కేరళను చూసి.. యోగి భయపడుతున్నారని కామెంట్ చేశారు. ఇక్కడ మంచి విద్య దొరుకుతుంది.. అనారోగ్యనికి గురయితే చికిత్స కూడా అందిస్తున్నామని తెలిపారు. కులం, మతం పేరుతో ప్రజలను చంపడం లేదే అని అడిగారు. రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం ఉందని.. మత సామరస్యం వెల్లివిరుస్తోందని అన్నారు. సామాజిక, ఆర్థిక భరోసా ఉంటుందని వివరించారు.

Kashmirs beauty, Bengals culture, Keralas education will do wonders for UP: Tharoor

తొలుత యోగి కామెంట్ చేశారు. రాష్ట్రాన్ని మరో కశ్మీర్, కేరళ.. లేదంటే బెంగాల్ చేయొద్దు అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న ఉదయం అన్నారు. ఉదయం ఓ వీడియోను షేర్ చేశారు. మీరు తప్పు చేస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని పరోక్షంగా ఆయన హెచ్చరించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసిందని.. చేస్తోందని కామెంట్ చేశారు. గత ఐదేళ్లలో చాలా అద్భుతాలు జరిగాయని గుర్తుచేశారు. మరోసారి ఆలోచించుకోవాలని.. లేదంటే రాష్ట్రం కేరళగా మారొచ్చు అని కామెంట్ చేశారు. కార్మికులకు ఉపాధి కల్పించామని... అన్నీ రంగాల్లో రాష్ట్రం అభివృద్ది పథంలో కొనసాగుతుందని వివరించారు. గత ఐదేళ్లలో తాను చేసిన పనులు మీ ఆశీర్వాదం అని ఆయన అన్నారు. మీరు వేసే ఓటు నిర్భయంగా ఉండేందుకు గ్యారంటీ వంటిదని కామెంట్ చేశారు.

English summary
Senior Congress leader Shashi Tharoor on Thursday took a dig over Uttar Pradesh Chief Minister Yogi Adityanath's remarks
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X