కథన్ నృత్యకారిణి సితార దేవి మృతి: ప్రధాని సంతాపం

ముంబై: ప్రముఖ కథక్ నృత్యకారిణి సితార దేవి(94) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. అనారోగ్య కారణంగా సితార దేవిని జస్లోక్ ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం చేర్చారు.

ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆమెను సోమవారం ఉదయం నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అంతకుముందు సితార దేవిని కుంబల్ల హిల్ ఆస్పత్రి, హర్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసంఆమెను జస్లోక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారని ఆమె అల్లుడు రాజేశ్ మిశ్రా తెలిపారు.

Kathak danseuse Sitara Devi passes away in Mumbai

పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో సితార దేవి 1920లో జన్మించారు. ఆమె తన తండ్రి వద్ద కవితలు, కొరియోగ్రఫీ నేర్చుకున్నారు. ఆమె బ్రాహ్మిణ్ కుటుంబంలో జన్మించారు. చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యం ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. ఆమె తండ్రి వైష్టవిట్ బ్రాహ్మిణ్ స్కాలర్, కథక్ కళాకారులు కావడంతో ఆమెను మరింత ప్రోత్సహించారు.

నృత్య పాఠశాలలో గురువుల వద్ద ఆమె ఎంతో ఆసక్తిగా విద్యను నేర్చుకున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో సితార దేవి సాహిత్యంపై పట్టు సాధించారు. ఠాగూర్ ఆమెను రూ. 50, శాలువతో సన్మనించేందుకు ప్రయత్నించగా ఆమె అందుకు నిరాకరించి, తనను గొప్ప నృత్యకారిణి కావాలని దీవించాలని సితారా దేవి కోరారు.

2011లో ఆమె లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును పొందారు. ఆరు దశాబ్దాలపాటు ఆమె క్లాసిక్ డ్యాన్సర్‌గా వెలుగొందారు. కాగా, సితార దేవి మృతి వార్త విన్న ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+