రేప్ నిందితులకు మద్దతు, మోడీ ఆగ్రహం: బీజేపీకి మంత్రులు రాజీనామా

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: కథువా అత్యాచారం కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన ఇద్దరు బీజేపీ మంత్రులు శుక్రవారం రాజీనామా చేశారు. చౌదరి లాల్ సింగ్, చందర్ ప్రకాశ్ గంగాలు నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. వారు మంత్రి పదవులతో పాటు బీజేపీకి కూడా రాజీనామా చేశారు. వారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి రాజీనామాను సమర్పించారు.

జనవరి 10న ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఇది సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మోడీ! మౌనం వీడండి, దేశం చూస్తోంది: రాహుల్ గాంధీ, ఎవరినీ వదలమని యోగి

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో అంబేడ్కర్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా నిందితులు ఎవరైనా వదిలేది లేదని, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఇలాంటి ఘటనలను సహించేది లేదని, రాజీనామా చేయాలని అధిష్టానం చెప్పడంతో వారు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఓ వైపు మోడీ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలేది లేదని చెప్పారు. మన కూతుళ్లకు న్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు అధిష్టానం ఆగ్రహంతో వారు రాజీనామా చేశారు.

 Kathua rape case, Jammu and Kashmir ministers who defended accused submit resignation to BJP

కథువా ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీం

కథువా అత్యాచార ఘటనను సుప్రీం కోర్టు శుక్రవారం సుమోటోగా తీసుకుంది. తొలుత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కొందరు డిమాండ్ చేశారు. కేసు కొలిక్కి రాకపోవడంతో సుప్రీం సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా, జమ్ము కాశ్మీర్ బౌర్ కౌన్సెల్‌కు సుప్రీం లిఖితపూర్వక సమాచారాన్ని పంపించింది.

అంతేకాదు, బాధితురాలికి సంబంధించిన చిరునామా లేదా ఆమెకు సంబంధించిన ఎలాంటి వ్యక్తిగత వివరాలను బయటకు చెప్పకూడదని మీడియాకు ఆదేశించింది. కేసులో వచ్చిన పురోగతి వివరాలను, బాధితురాలి తరఫున వాదించడానికి ముందుకు వచ్చిన లాయర్‌ను బెదిరించారని వస్తున్న వార్తలకు సంబంధించి వివరాలు సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, దినేష్‌తో కూడిన ధర్మానం శుక్రవారం ఈ మేరకు నిర్ణయాన్ని తెలిపింది. దీనిపై జస్టిస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. స్థానికంగా కొందరు న్యాయవాదులు తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోందన్నారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల చిన్నారి హత్యోదంతంలోను ఇదే జరుగుతోందన్నారు. స్థానిక న్యాయవాదులే ప్రజలకు అండగా ఉండాలని, అలాంటప్పుడు కేసులను సులభంగా విచారించగలమని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Following widespread outrage, Chaudhary Lal Singh and Chander Prakash Ganga, Jammu and Kashmir ministers who attended a rally defending those accused in the Kathua rape case have resigned from the BJP, said media reports.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి