కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల తాత్కాలిక మూసివేత.. కారణమిదే!!

ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన, చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయాన్ని, బద్రీనాథ్ ఆలయాన్ని, గంగోత్రి యమునోత్రి ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. శీతాకాలం దృష్ట్యా మంచు కప్పేయడంతో అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడిందని, దీంతో ఆలయ పరిసర ప్రాంతాలలో పెద్ద మొత్తంలో మంచు కప్పేసింది అని పేర్కొన్నారు. ఆలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద ఎముకలు కొరికే చలి ఉండడంతో భక్తులు వెళ్లలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్న ఆలయ పండితులు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ మహా ద్వారాన్ని గురువారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మూసివేశారు. ఆపై కేదార్ నాథ్ గుడిలోని కేదార్ నాథ్ స్వామిని ఉఖీ మఠ్ లోని ఓంకారేశ్వర ఆలయానికి తీసుకువెళ్లారు.

Kedarnath and Badrinath temples temporarily closed..this is the reason!!

ఆయన వచ్చే ఆరు నెలల పాటు అక్కడే కేదార్ నాథ్ కు పూజాధికాలను నిర్వహిస్తారు. చార్ధామ్ లోని ప్రధాన పుణ్యక్షేత్రమైన యమునోత్రిని కూడా బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు మూసివేసి భక్తులు దర్శనాన్ని నిలిపివేశారు. యమునా దేవిని ఉత్తర కాశీలోని ఖర్సాలీ లోని కుషి మఠానికి తీసుకువెళ్లారు. అంతేకాదు మంగళవారం నాడే గంగోత్రిని సైతం మూసివేసిన చార్ ధామ్ ఆలయ అధికారులు నవంబర్ 18వ తేదీన బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేయనున్నారు.

ప్రతి సంవత్సరం ఈ ఆలయాలు అక్టోబర్, నవంబర్ నెల నుండి ఏప్రిల్, మే నెల వరకు మూసి వేయబడతాయి. కేదార్ నాథ్ ఆలయాన్ని మూసివేసే సమయంలో ఎముకలు కొరికే చలిలో కూడా 2500 మంది భక్తులు స్వామిని దర్శించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కేదార్నాథ్ ఆలయాన్ని 19.5 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు బద్రీనాథ్ కేదార్ నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.

అత్యంత క్లిష్టమైన, సాహసోపేతమైన కేదార్ నాథ్ యాత్రను జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలని హిందువులు కోరుకుంటారు. హిమాలయాల మధ్యలో ఉన్న పవిత్ర ఆలయానికి చేరుకోవటం అంత సులభం కాదు, ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది. అక్కడకు వెళ్లి ఒక్కసారి స్వామిని దర్శించుకుంటే చాలు జన్మజన్మల పుణ్యఫలం వస్తుందని నమ్ముతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+