సావర్కర్ సంతానానికి భయపడేదే లేదు- సిసోడియాపై ఎల్జీ ఆరోపణలకు కేజ్రివాల్ కౌంటర్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మద్యం, అవినీతి మాఫియాల్ని ప్రోత్సహిస్తున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వీటిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు సిసోడియా చాలా కష్టపడుతున్నారని, దాని వల్ల ప్రశంసలు, ఎన్నికల మద్దతు లభిస్తున్నాయని, అందుకే కేంద్రం వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
సిసోడియా తనకు 22 సంవత్సరాలుగా తెలుసని, ఆయన "హార్డ్ కోర్ నిజాయితీ" వ్యక్తి అని కేజ్రివాల్ వెల్లడించారు.. మనీష్ సిసోడియాపై సీబీఐకి కేసు పెట్టామని, మరికొద్ది రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారని తెలిసిందని, ఇది పూర్తిగా ఫేక్ కేసు అని, ఈ కేసులో అసలు నిజం లేదని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వ వివాదాస్పద కొత్త ఎక్సైజ్ పాలసీపై సీబీఐ దర్యాప్తు చేయాలని సక్సేనా ఇవాళ సిఫార్సు చేశారు. చీఫ్ సెక్రటరీ నివేదికను ప్రస్తావిస్తూ .. ఎక్సైజ్ శాఖ ఇన్‌ఛార్జ్ మంత్రి మనీష్ సిసోడియా అవినీతికి పాల్పడ్డారని, ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించే మద్యం వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా పని చేశారని ఆరోపించారు. దీనిపై కేజ్రివాల్ భగ్గుమన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తు సూచనను బీజేపీ నేతలు స్వాగతించారు . తాము కూడా మద్యం విధానంపై విచారణకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. దీంతో ఈ డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతల్ని "సావర్కర్ పిల్లలు" అని కేజ్రివాల్ అభివర్ణించారు. తమ పార్టీ నాయకులు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పిల్లలని, అతను బ్రిటిష్ వారి ముందు తలవంచడానికి నిరాకరించాడని, దానికి బదులుగా ఉరితీతను ఎంచుకున్నాడని కేజ్రివాల్ తెలిపారు. ఇప్పుడు భగత్ సింగ్ వారసులైన తాము జైలుకెళ్లినా భయం లేదన్నారు. ఢిల్లీ అభివృద్ధి నమూనా కారణంగా ఆప్‌కి లభించిన ప్రజాదరణ మరియు ఎన్నికల విజయమే కేంద్రాన్ని భయపెట్టిందని, దీని కారణంగా వారు పార్టీపై దాడి చేసి తమ ఎమ్మెల్యేలను జైలుకు పంపుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications