ఢిల్లీలో ఉద్యోగాల బడ్డెట్-కేజ్రివాల్ సర్కార్ మరో రికార్డు-ఐదేళ్లలో 20 లక్షల మందికి
దేశవ్యాప్తంగా కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సాధారణ బడ్డెట్, వ్యవసాయ బడ్జెట్లు ప్రవేశపెడుతుంటే ఢిల్లీలోని అరవింద్ కేజ్రివాల్ సర్కార్ మాత్రం ఏకంగా ఉద్యోగ బడ్డెట్ నే ప్రవేశపెట్టింది. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధికమంత్రి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే సాధారణ బడ్జెట్ లోనే ఉద్యోగాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ దీన్ని ప్రవేశపెట్టారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిదో బడ్జెట్‌ను సమర్పించారు. 2022-23 సంవత్సరానికి రూ.75,800 కోట్ల బడ్జెట్‌ను సమర్పించారు. 2014-15లో రూ.30,940 కోట్లుగా ఉన్న బడ్జెట్ కంటే ఇది రెండున్నర రెట్లు అధికం. ఢిల్లీకి ఈ ఏడాది బడ్జెట్‌ను 'ఉపాధి బడ్జెట్'గా సిసోడియా అభివర్ణించారు. అసెంబ్లీలో మనీష్ సిసోడియా మాట్లాడుతూ తాము ప్రవేశపెడుతున్న ఎనిమిదో బడ్జెట్ అని, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏడు బడ్జెట్‌లు ఢిల్లీ పాఠశాలలను మెరుగుపరిచాయని, అందరికీ కరెంటు అందుబాటులోకి తెచ్చాయని, కరెంటు బిల్లులు తగ్గాయని, మెట్రోను విస్తరించామని తెలిపారు. ఇప్పుడు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు.

గత ఏడేళ్లలో ఆప్ ప్రభుత్వం లక్షా 78 వేల మంది యువతకు శాశ్వత ఉద్యోగాలు కల్పించిందని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇలాగే చేయడంలో విఫలమయ్యాయని అన్నారు. కొన్ని ఉద్యోగ రంగాలలో 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలను ఆయన ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఉపాధి బడ్డెట్ ప్రవేశపెట్టిన సిసోడియా.. ఇందులో భాగంగా రిటైల్, ఆహారోత్పత్తులు, లాజిస్టిక్స్, రవాణా, పర్యాటకం, వినోదం, నిర్మాణం, రియల్ ఎస్టేట్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఈ ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు వెల్లడించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications