ఇద్దరు తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు

హైదరాబాద్: ఈసారి ఇద్దరు తెలుగు కవులు వారాల ఆనంద్, మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన 'ఆకుపచ్చ కవితలు' పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది.

ప్రముఖ కవులలో ఒకరైన భావకవి పద్మభూషణ్ గుల్జార్.. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో పుంఖానుపుంఖాలుగా కవిత్వం రాశారు. గుల్జార్ రాసిన గ్రీన్ పోయెమ్స్‌ని పవన్ కే వర్మ ఆంగ్లానువాదం తోడ్పాటుతో 'ఆకుపచ్చ కవితలు' పేరుతో తెలుగులోకి అనువదించారు ద్విభాషా కవి వారాల ఆనంద్. ఇందులోని 58 కవితలు ప్రకృతికి సంబంధించినవే. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఈ కవితల ద్వారా ఎంతో సూటిగా చెప్పారు.

 Kendra Sahitya akademi award to two telugu poets Varala Anand and Madhurantakam narendra.

మధురాంతకం నరేంద్ర రాసిన 'మనో ధర్మపరాగం' నవలకు సాహిత్య అకాడమి అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద తామ్ర ఫలకం, రూ. 50 వేల నగదును అందజేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+