రెడీ ..1,2,3 : స్మైల్, ఫోటోకు ఫోజిస్తూ నది తీరంలో పడిన జంట, వైరలైన వీడియో
తిరువనంతపురం : పెళ్లి .. జీవితంలో మధురమైన ఘట్టం. ఆ మరపురాని సన్నివేశాన్ని పదిలంగా ఉంచుకునేందుకే యువ జంట తాపత్రాయపడుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఫోట్ షూట్ చేయించుకొని .. నలుగురిలో తాము డిఫరెంట్ అని చూపే ప్రయత్నం చేస్తారు. కేరళలో కూడా ఓ జంట అలాంటి ప్రయత్నమే చేసి .. బొక్కబొర్లాపడింది.

నది తీరంలో షూట్ .. బోల్తా
కేరళకు చెందిన తిజిన్, శిల్పల పెళ్లి వచ్చే నెల 6న జరుగనుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. రొటిన్‌కు భిన్నంగా నదిలో షూట్ ప్లాన్ చేశారు. పంబా నదీ తీరంలో ఫొటోలు తీసుకుంటూ పడవలో కూర్చున్నారు. వెడ్డింగ్ షూట్ నిర్వాహకులు చెప్పినట్టు ఫోజిస్తున్నారు. ఇంతలో బ్యాలెన్న్ తప్పింది. ఇంకేముంది కాబోయే పెళ్లికూతురు, పెళ్లికొడుకు నీళ్లలో పడిపోయారు. వెంటనే తేరుకున్న తిజిన్ .. శిల్పాను బయటకు తీసుకొచ్చారు.
నెట్టింట్లో వీడియో వైరల్
ఏ చిన్న పొరపాటు జరిగితే నెట్టింట్లో వైరలవుతోంది. ఇక పెళ్లి సందర్భంగా చేసిన షూట్‌లో పడిపోవడంతో సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. తిజిన్, శిల్ప ప్రీ వెడ్డింగ్ షూట్‌ను వెడ్ ప్లానర్ వెడ్డింగ్ స్టూడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది యూజర్లు తెగ చూసేసి .. కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే 3.31 లక్షల మంది వీక్షించారు. తాజాగా ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.












Click it and Unblock the Notifications