ఏనుగు పిల్ల కోసం ఎయిర్‌లిఫ్ట్.. అనాథ పిల్లకు అండగా అనంత్ అంబానీ వంతారా!
అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న 18 నెలల అనాథ ఏనుగు పిల్ల 'మాయ'కు కొత్త జీవితం ప్రసాదించేందుకు కేరళ అటవీ శాఖ, అనంత్ అంబానీకి చెందిన 'వంతారా' ప్రాజెక్టు చేతులు కలిపాయి. తీవ్రమైన గాయాలు, ఎముకల బలహీనతతో నిలబడలేని స్థితిలో ఉన్న ఈ చిన్నారి ఏనుగును కేరళలోని అభయారణ్యం నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారాలోని అధునాతన ఏనుగుల ఆస్పత్రికి ప్రత్యేక ఎయిర్‌లిఫ్ట్ ద్వారా తరలించారు.
దయామరణం ఆలోచన నుంచి కొత్త ఆశల వైపు
ఏనుగు పిల్ల 'మాయ' జీవితం మొదటి నుంచీ పోరాటాల మయమే. గతేడాది ఏప్రిల్ 19న మలయత్తూర్ డివిజన్లోని కప్రిక్కాడ్ వద్ద డీహైడ్రేషన్ స్థితిలో అనాథగా చిక్కిన ఈ ఏనుగు పిల్లను కేరళ అటవీ అధికారులు రక్షించారు. అప్పటి నుంచి అభయారణ్యంలో అధికారుల పర్యవేక్షణలోనే పెరుగుతోంది. అయితే ఈ ఏడాది జులై 2న ఆడుకుంటూ కిందపడటంతో దానికి కుడి భుజం ఫ్రాక్చర్ అయింది. ఫిజియోథెరపీ, పోషకాహార మందులు అందించినప్పటికీ దాని పరిస్థితి నానాటికి క్షీణించింది. ఎముకల క్షీణత, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తోడు కావడంతో అక్టోబర్ చివరినాటికి అది పూర్తిగా పడుకున్న చోటు నుంచి లేవలేని స్థితికి చేరుకుంది. మాయ పడుతున్న నరకయాతనను చూసి దయామరణం ప్రసాదించాలని అక్టోబర్ 29న వైద్య మెడికల్ బోర్డు బాధాకరమైన సిఫార్సు చేసింది. అయితే చివరి ప్రయత్నంగా నిపుణుల అభిప్రాయం తీసుకోవాలన కేరళ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ డాక్టర్ పి.పుగళేంది నిర్ణయించారు.

రంగంలోకి దిగిన వంతారా
మాయ ఎక్స్-రేలు, బ్లడ్ రిపోర్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన వంతారా వెటర్నరీ నిపుణులు.. దానికి ఉన్నది పారాథైరాయిడ్ సంబంధిత లోపం కావచ్చునని, సరైన వైద్యం అందిస్తే కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంత్ అంబానీ మార్గదర్శకత్వంలో నడిచే 'జీవ్ సేవా' సిద్ధాంతానికి కట్టుబడి వంతారా బృందం వెంటనే రంగంలోకి దిగింది. ప్రత్యేక లైఫ్-సపోర్ట్ సిస్టమ్స్ అమర్చిన ఎయిర్ అంబులెన్స్ ద్వారా మాయను జామ్‌నగర్‌కు తరలించారు. అక్కడ హైడ్రాలిక్ లిఫ్టింగ్ సిస్టమ్స్, అధునాతన ఐసీయూ విభాగం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందించారు.
అనుబంధం తెగిపోకుండా ప్రత్యేక జాగ్రత్తలు
కొత్త వాతావరణంలో ఏనుగు పిల్ల భయపడకుండా ఉండటానికి కేరళ అటవీ శాఖ, వంతారా బృందం ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. కేరళ అటవీ శాఖకు చెందిన అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ బినోయ్ సి.బాబుతో పాటు మాయను చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న కేర్ టేకర్ నిఖిల్ బాబు కూడా ఎయిర్ అంబులెన్స్‌లోనే జామ్‌నగర్ వెళ్లారు. చికిత్స కాలం పూర్తయ్యే వరకు నిఖిల్ బాబు పక్కనే ఉండి దానికి మానసిక ధైర్యాన్ని అందించనున్నారు. కేరళ మానిటరింగ్ కమిటీ నిరంతరం ఏనుగు పిల్ల వైద్య పురోగతిని పర్యవేక్షిస్తుండగా.. మాయ పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ కేరళలోని తన సొంత అభయారణ్యానికి సురక్షితంగా తరలించనున్నారు.
Kerala Forest Department orders airlift of an ailing 18month old elephant from Abhayaranyam to Vantara Jamnagar, for specialized intensive hospital care.Maya, an 18-month-old elephant has not been able to stand since a fall in July.#prayformaya #vantara #mradubhashi https://t.co/ocVtxwQzap
— Mradubhashi (@mradubhashi1) November 6, 2026












Click it and Unblock the Notifications
