తమ్ముడి చికిత్సకు రూ.46 కోట్లు సేకరించిన బాలిక-చివరికి అదే వ్యాధితో మృత్యువాత-కేరళలో ఘటన

కేరళలో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన తమ్ముడు మొహమ్మద్ కోసం ఏకంగా రూ.46 కోట్ల విరాళాల్ని సేకరించిన కేరళ బాలిక అఫ్రా.. ఇవాళ అదే వ్యాధితో తాను కన్నుమూసింది. హృదయవిదారకమైన ఈ ఘటన కన్నూర్ లోని మట్టాల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

గతేడాది జూన్ లో కేరళలోని కన్నూర్ లో ఉన్న మట్టాల్ లో నివసిస్తున్న 16 ఏళ్ల దివ్యాంగ బాలిక అఫ్రాకు ఓ ఏడాదిన్నర తమ్ముడు మొహమ్మద్ కు స్పైనల్ మస్కులార్ అస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధి సోకింది. ఎముకల్ని బలహీనం చేసే ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటేనే కోట్లు అవసరం. డాక్టర్లను సంప్రదిస్తే ఆ బాలుడికి రెండేళ్ల వయసు రాకముందే రూ.18 కోట్లు విలువైన ఇంజెక్షన్ చేయాలన్నారు. దీంతో ఆ కుటుంబానికి అంత స్తోమత లేక సోషల్ మీడియాలో జనం సాయం కోరింది. దీంతో దేశ విదేశాల్లో ఉన్న దాదాపు 7.7 లక్షల మంది ఏకంగా రూ.46 కోట్ల రూపాయలు సాయం చేశారు. దీంతో తమ్ముడికి కోట్ల విలువైన మందులు ఇప్పించి ప్రాణం కాపాడింది.

kerala girl raise rs.46 crore fund for brothers treatment died with same genetic disorder

అప్పటికే అదే వ్యాధితో బాధపడుతూ దివ్యాంగురాలిగా మారిన అఫ్రా తన తమ్ముడి కోసం సాయం కోరడం, రూ.46 కోట్ల విరాళాలు లభించడంతో అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతే కాదు తన తమ్ముడికి అవసరమైన రూ.18 కోట్లు మాత్రమే తీసుకుని తమలాగే బాధపడుతున్న మరో ఇద్దరు చిన్నారులకు కూడా అఫ్రా ఈ డబ్బులతో సాయం చేసింది. చివరికి మిగిలిన రూ.12 కోట్లను కేరళ ప్రభుత్వానికి ఇచ్చేసి తమ లాంటి చిన్నారుల్ని రక్షించమని అర్ధించింది. దీంతోపాటు పదో తరగతి చదువుతున్న తాను తీసుకుంటున్న చికిత్సతో పాటు తన తమ్ముడికి ఇస్తున్న చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో ఉంచేది. పాటలు పాడటం, వ్లాగింగ్ చేయడంలో ఆసక్తి కలిగిన అఫ్రా డాక్టర్ కావాలనుకుంది. కానీ విధి మరోలా తలచింది.

kerala girl raise rs.46 crore fund for brothers treatment died with same genetic disorder

స్పైనల్ మస్కులార్ అస్ట్రోఫీ (ఎస్ఎంఎల్ ) వ్యాధితోనే బాధపడుతున్న అఫ్రా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో కోజికోడ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచింది. కానీ అఫ్రా తన తమ్ముడ్ని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నం, ఆ తర్వాత ఇతర చిన్నారుల గురించి ఆలోచించడం, తనకు సాయంగా అందిన నిధుల్ని అవసరమైనంతే వాడుకుని ప్రభుత్వానికి ఇచ్చేయడం, చివరికి మృత్యువాత పడటం కేరళ వాసులతో పాటు దేశంలోని ఎందరినో కదిలించాయి.

kerala girl raise rs.46 crore fund for brothers treatment died with same genetic disorder
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+