భారత్ లో పాగాకు ఐసిస్ యత్నం, గల్ఫ్ నుంచి భారీగా నిధులు, అప్రమత్తమైన ఇంటెలిజెన్స్!
ప్రపంచంలోని పలు దేశాల్లో నెత్తుటి ఏర్లు పారించిన ఐసిస్... ఇప్పుడు భారత్ లో పాగా వేసేందుకు యత్నిస్తోంది. ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థ మనదేశంలోని కేరళను టార్గెట్ చేస్తోంది.
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో క్రమంగా ప్రాబల్యం తగ్గిపోవడంతో... ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కన్ను మన దేశంపై పడింది. ప్రపంచంలోని పలు దేశాల్లో నెత్తుటి ఏర్లు పారించిన ఐసిస్... ఇప్పుడు భారత్ లో పాగా వేసేందుకు యత్నిస్తోంది.
ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థ మనదేశంలోని కేరళను టార్గెట్ చేస్తోంది. కేరళ నుంచి వెళ్లి ఐసిస్ లో చేరుతున్నవారికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తూ.. భారత్ లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తోంది.

ఈ క్రమంలో భారత్ కు నిధులను తరలించేందుకు ఈ ఉగ్రవాద సంస్థ హవాలా మార్గాలను ఎంచుకుంది. అయితే భారత్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ నిధులను సమకూరుస్తోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు.. ఐసిస్ ప్రణాళికలను భగ్నం చేశారు.
ఐసిస్ సానుభూతిపరులపై మెరుపుదాడులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గల్ఫ్ దేశాల నుంచి హవాలా రూపంలో తస్లీం అనే వ్యక్తికి డబ్బు వస్తోందని, అతడి వద్ద నుంచి ఐసిస్ సానుభూతిపరులకు పంపిణీ అవుతోందని పోలీసులు గుర్తించారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications