బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

plants: లేడీ గెటప్ లో వెళ్లి రూ. లక్షల విలువైన మొక్కలు చోరీ, రాష్ట్రపతి అవార్డు, సీసీటీవీల్లో !

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఎవరు ఎప్పుడు ఎక్కడ చోరీలు చేస్తారో తెలీదు. బంగారు, డబ్బు,విలువైన వస్తువులు, కార్లు, బైక్ లో ఇలా అనేక రకాల వస్తువులు చోరీ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ పోటుగాడు మొక్కలు చోరీ చేశాడు. మామూలుగా మొక్కలు చోరీ చేస్తే అది పెద్ద వార్త కాదు. లేడీ గెటప్ లో వెళ్లి రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకున్న మహిళ ఇంటిలో లక్షల రూపాయల విలువైన ఆంథూరియం మొక్కలు చోరీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Wife: వదిన రొమాన్స్ సీన్ చూసిన మరిది, వదిన పక్కన అన్న కాదు, ప్రియుడు, ఒరేయ్, క్లైమాక్స్ లో ట్విస్ట్ !Wife: వదిన రొమాన్స్ సీన్ చూసిన మరిది, వదిన పక్కన అన్న కాదు, ప్రియుడు, ఒరేయ్, క్లైమాక్స్ లో ట్విస్ట్ !

యువతి వేషంలో సుమారు రెండు లక్షల విలువైన ఆంథూరియం మొక్కలను దొంగిలించిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కొల్లం జిల్లాలోని చవర గ్రామం పుదుక్కాడ్ కిజక్కత్తిల్ ముదిల్ లోనివాసం ఉంటున్న వినీత్ క్లీటస్‌ అలియాస్ వినీత్ అనే యువకుడు అరెస్టు అయ్యాడు. అమరవిల కొల్లాలోని మంచమాకులిలోని గ్రీన్ హౌస్‌లో రిటైర్డ్ ఐఆర్‌ఇ అధికారి జపమణి భార్య విలాసినీ భాయ్ తన ఇంట్లో పెంచిన ప్రత్యేక జాతికి చెందిన సుమారు 200 ఆంథూరియం మొక్కలను వినీత్ చోరీ చేశాడు.

 Kerala young man stole expensive plants in ladys get-up, recorded on CCTV, online sales in Bengaluru.

జపమణి, ఆయన భార్య విలాసినీ భాయ్ అలంకార మొక్కల నిర్వహణకు 2017లో రాష్ట్రపతి అవార్డును గెలుచుకున్నారు. కేరళలో జపమణి, విలాసినీ భాయ్ దంపతులకు మంచి పేరు ఉంది, ఈ దంపతుల ఇంటిని నిందితుడు వినీత్ టార్గెట్ చేసుకున్నాడు. 2011 మార్చి నెలలో మహిళ వేషంలో వెళ్లిన వినీత్ విలాసినీ భార్య ఇంటిలో ఆంథూరియం జాతి మొక్కలను చోరీ చేశాడు. చోరీ చేస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరిపి నిందితుడి కోసం గాలించారు.

romance: అక్రమ సంబంధం, ఒకే కంపెనీలో ? రాత్రి కారులోనే రొమాన్స్, లక్షలు స్వాహా, ట్విస్ట్ !romance: అక్రమ సంబంధం, ఒకే కంపెనీలో ? రాత్రి కారులోనే రొమాన్స్, లక్షలు స్వాహా, ట్విస్ట్ !

మొక్కలు చోరీ చేసిన తరువాత నిందితుడు వినీత్ ఐటీ హబ్ బెంగళూరు పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. బెంగళూరు వెళ్లిన పోలీసులు శుక్రవారం రాత్రి నిందితుడు వినీత్ ను అరెస్టు చేసి కేరళకు పిలుచుకుని వెళ్లారు. చోరీ చేసిన మొక్కలను వినీత్ సోషల్ మీడియా ద్వారా ఆన్ లైన్ లో ఆ మొక్కలు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి నేరానికి పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది.

English summary
Kerala young man stole expensive plants in lady's get-up, recorded on CCTV, online sales in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X