బస్సు నడపడం రాకున్నా డ్రైవింగ్ చేసిన మహిళా ఎమ్మెల్యే.. చివరికి ఏమయిందంటే..
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కర్ణాటక సర్కార్.
శక్తి యోజన పథకం కింద ప్రభుత్వ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ లు శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఒక మహిళ ఎమ్మెల్యే అత్యుత్సాహంతో బస్సు నడిపే ప్రయత్నం చేయగా అపశృతి చోటు చేసుకుంది.

కే జి ఎఫ్ లోని కువెంపు బస్టాండ్ లో కేజీఎఫ్ ఎమ్మెల్యే రూప కళ కెఎస్ఆర్టిసి బస్సును నడిపారు. కువెంపు బస్టాండ్లో శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని బస్సులను ప్రారంభించారు. ఆపై ఆమె బస్సు నడపడం ఏదో ఈజీ అనుకున్న రూప కళ తనకు నడపడం చేత కాకున్నా డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ చేపట్టారు.
బస్సు డ్రైవర్ గేరు మార్చడంలో సహకరించడంతో ఎమ్మెల్యే 100 మీటర్ల పాటు బస్సును నడిపారు. ఆపై కార్యకర్తలు మళ్లీ బస్సు నడపాలని పట్టుబట్టడంతో మరో బస్సును కూడా నడిపారు. ఈసారి రూపకళ స్వయంగా తానే గేర్ మార్చడానికి ప్రయత్నం చేయడంతో ఆమె నడిపే బస్సు ముందుకు కాకుండా వెనక్కి వెళ్లి వెనుక పార్క్ చేసి ఉన్న కార్లకు గుద్దుకొని ఆగింది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును కంట్రోల్ చేశాడు.
దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక ఈ ఘటన నేపథ్యంలో డ్రైవింగ్ సరిగ్గా రాకుండా ఎమ్మెల్యే అత్యుత్సాహం చేయడం దేనికి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వెనక మనుషులు ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. ఎవరైనా ఉంటే వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసేవి కాదా అంటూ పలువురు చర్చిస్తున్నారు. ఏది ఏమైనా డ్రైవింగ్ రాకపోయినా బస్సు నడిపి వేరే వాహనాలకు బస్సును గుద్దిన కే జి ఎఫ్ ఎమ్మెల్యే అతి ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications