తమిళనాట ఎన్నికల వేళ KGF బిగ్ ప్లాన్- టార్గెట్ ఫిక్స్..!!
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ నెలకున్న త్రిముఖ పోటీ వేళ.. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది.
కమ్మ మహానాడును భారీ ఎత్తున నిర్వహించేందుకు సిద్దమైంది. తమిళనాడులో 65 లక్షల మందికి పైగా కమ్మ జనాభా ఉన్నారు. కమ్మ సమాజ ఐక్యతకు, సంఘటిత బలం నిరూపించేలా ఈ సభలు ఏర్పాటు చేసారు. దీంతో, తమిళనాట ఎన్నికల్లో ఏ పార్టీకి వీరి మద్దతు ఉంటుంది.. ఈ సభల ద్వారా ఏం సంకేతాలు ఇవ్వబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) ఆధ్వర్యంలో తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఫిబ్రవరి 8న కమ్మ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు KGF వ్యవస్థాపక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ వెల్లడించారు. ఈ మహానాడు ద్వారా తమ లక్ష్యం కమ్మ సమాజ ఐక్యత.. సంఘటిత బలం పెంచటమేనని స్పష్టం చేసారు. ఇందు కోసం ఈ మహానాడు ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. కమ్మ జనాభాలో అత్యధికంగా 65 లక్షల మందికి పైగా తమిళనాడులోనే నివసిస్ తున్నారని వివరించారు. దీంతో,కమ్మ సమాజ గుర్తింపును బలపరచడం, సామాజిక ఐక్యతను మరింత పెంపొందించేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో రాజకీయం గా వెనుకబడుతున్న కమ్మవారి భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా మహానాడు నిర్వహిస్తున్నట్లు జెట్టి కుసుమ కుమార్ పేర్కొన్నారు.

ఎన్నికల వేళ బలం చాటేలా
రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కమ్మ సమాజానికి తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ఈ మహానాడు ద్వారా డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. కా, కమ్మ సమాజంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక, సామాజికంగా చేయూతనివ్వడంపై ప్రత్యేక దృష్టి సారించను న్నట్లు వివరించారు. కాగా, 2024 లో కేజీఎఫ్ హైదరాబాద్ వేదికగా నిర్వహించిన కమ్మ సమిట్ కు తెలంగాణ సీఎం రేవంత్ హాజరయ్యారు. ఇక.. ఇప్పుడు శ్రీపెరంబుదూర్ సభకు తమిళ నేతలను ఆహ్వానిస్తోంది. తమిళ రాజకీయాల్లో పలువురు కమ్మ నేతలు కీలక పదవుల్లో నిలిచారు. ఇక.. రాష్ట్రం లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ప్రతీ ఓటు కీలకంగా మారుతోంది. ఈ సమయంలో కేజీఎఫ్ వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహానాడు ద్వారా ఎన్నికల సమయంలో పార్టీలను ఆకర్షించే అవకాశం ఉంది. ఏ పార్టీ అయితే డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తుందో ఆ పార్టీ వారికే తమ మద్దతు ఉంటుందని కేజీఎఫ్ పేర్కొంది. దీని ద్వారా కమ్మ వర్గానికి పార్టీ ల నుంచి ప్రాతినిధ్యం.. హామీల పైన స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కమ్మ మహానాడు తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications