• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: శోభనం రోజు స్వర్గం చూపించింది. రాత్రి భర్త పక్కన నిద్రపోయిన భార్య ఎస్కేప్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. మీ అమ్మానాన్నను మా ఇంటికి పంపిస్తే పెద్దలు మాట్లాడుకుంటారని, తరువాత మనం పెళ్లి చేసుకుందామని ప్రియుడు చెప్పాడు. మా తల్లిదండ్రులు చనిపోయారని, ప్రస్తుతం నేను అనాథను అని ప్రియురాలు చెప్పింది. ప్రియుడితో పాటు అతని కుటుంబ సభ్యులు చలించిపోయి ఖర్చు మొత్తం వాళ్లే పెట్టుకుని, యువతికి బంగారు నగలు తీసిచ్చి పెళ్లి జరిపించారు. వారం రోజుల పాటు భర్తతో కాపురం చేసింది. రాత్రి భర్త పక్కన నిద్రపోయిన కొత్త పెళ్లి కూతురు ఉదయం చూసేసరికి మాయం అయ్యింది. సాయంత్రం వరకు భార్య కోసం వెతికిన కొత్త పెళ్లికొడుకు అనుమానం వచ్చిన బీరువాలో చూడగా లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, నగదు మాయం అయ్యిందని గుర్తించి లబోదిబో అని నెత్తినోరు కొట్టుకుంటున్నాడు.

Businessman: కోటీశ్వరులకే కోటీశ్వరుడు, 23వ అంతస్తు నుంచి దూకి ?, పక్కరూమ్ లో భార్య, మ్యాటర్?Businessman: కోటీశ్వరులకే కోటీశ్వరుడు, 23వ అంతస్తు నుంచి దూకి ?, పక్కరూమ్ లో భార్య, మ్యాటర్?

 ఒకే కంపెనీలో ఉద్యోగం

ఒకే కంపెనీలో ఉద్యోగం

చెన్నై సిటీలోని పశ్చిమ తాంబరం ప్రాంతంలోని రంగనాథపురంలో నటరాజన్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చెన్నై సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో నటరాజన్ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో అభినయ (28) అనే యువతి ఉద్యోగం చేస్తున్నది. ఒకేచోట ఉద్యోగం చేస్తున్న నటరాజన్, అభినయాకు పరిచయం ఉంది.

 ఎంజాయ్ చేసిన లవర్స్

ఎంజాయ్ చేసిన లవర్స్

గత ఏడాది నుంచి నటరాజన్, అభినయ ప్రేమించుకుంటున్నారు. కంపెనీలో ఉద్యోగం పూర్తి అయిన వెంటనే ప్రియురాలు అభినయాను బైక్ లో కుర్చోబెట్టుకుని బయట తిరుగుతున్న నటరాజన్ పూర్తిగా ఆమెకు దాసోకహం అయ్యాడు. అభినయా పీజీలో ఉండటం, కుటుంబ సభ్యులు దగ్గరగా లేకపోవడంతో రాత్రి పొద్దుపోయే వరకు ప్రియుడు నటరాజన్ తో తిరిగింది.

 నాకు ఎవరు లేరు, నేను ?

నాకు ఎవరు లేరు, నేను ?

మీ అమ్మానాన్నను మా ఇంటికి పంపిస్తే పెద్దలు మాట్లాడుకుంటారని, తరువాత మనం పెళ్లి చేసుకుందామని నటరాజన్ అతని ప్రియురాలు అభినయాకు చెప్పాడు. మా తల్లిదండ్రులు చనిపోయారని, ప్రస్తుతం నేను అనాథను అని ప్రియురాలు అభినయ ఆమె ప్రియుడు నటరాజ్ కు చెప్పింది. నటరాజన్ అతని లవ్ మ్యాటర్ అతని ఇంట్లో చెప్పాడు.

 గ్రాండ్ గా పెళ్లి జరిగింది

గ్రాండ్ గా పెళ్లి జరిగింది

అభినయా చెప్పిన మాటలు విన్న ఆమె ప్రియుడు నటరాజన్ పాటు అతని కుటుంబ సభ్యులు ప్రియురాలి విసయంలో చలించిపోయి ఆమెకు మంచి జీవితం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి ఖర్చులు మొత్తం నటరాజన్ కుటుంబ సభ్యులే పెట్టుకుని, అభినయాకు బంగారు నగలు తీసిచ్చి ఆగస్టు 29వ తేదీన చెన్నైలోని రంగనాథపురంలోని పెరుమాల్ ఆలయంలో బంధువుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిపించారు.

 వారం రోజులు కాపురం చేసిన కొత్త పెళ్లి కూతురు ఎస్కేప్

వారం రోజులు కాపురం చేసిన కొత్త పెళ్లి కూతురు ఎస్కేప్

వారం రోజుల పాటు భర్త నటరాజన్ తో అభినయా సంతోషంగా కాపురం చేసింది. వారం రోజులు ఇద్దరూ సినిమాలు, షికార్లు తిరిగేశారు. రాత్రి భర్త నటరాజన్ పక్కన నిద్రపోయిన కొత్త పెళ్లి కూతురు అభినయా ఉదయం చూసేసరికి మాయం అయ్యింది. అభినయా మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె భర్త నటరాజన్ హడలిపోయాడు.

 నగలు, నగదు మాయం

నగలు, నగదు మాయం

మరుసటి రోజు రాత్రి వరకు భార్య అభినయా కోసం వెతికిన కొత్త పెళ్లికొడుకు నటరాజన్, అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి బీరువాలో చూడగా లక్షల రూపాయల విలువైన 17 సవర్ల బంగారు నగలు, రూ. 20 వేల నగదు మాయం అయ్యిందని గుర్తించి లబోదిబో అని నెత్తినోరు కొట్టుకుంటున్నారు.

 ధైర్యం చేసి ఇప్పుడు కేసు పెట్టిన భర్త

ధైర్యం చేసి ఇప్పుడు కేసు పెట్టిన భర్త

ఇటీవల తమిళనాడులోని తిరుచ్చి, సేలం, కన్యాకుమారి తదితర జిల్లాల్లో అమ్మాయిలను అడ్డం పెట్టుకున్న పెళ్లిళ్ల బ్రోకర్లు పెళ్లి చేసి అనేక మంది యువకులను మోసం చెయ్యడం, నగలు, నగదుతో పారిపోవడం, తరువాత అరెస్టు కావడం వెలుగు చూస్తోంది. అభినయా పారిపోయిన రెండు నెలలకు నటరాజన్ ఆమె మీద కేసు పెట్టారు. అభినయాది మదురై జిల్లా అని నటరాజన్ చెప్పడంతో చెన్నై సిటీ పోలీసులతో పాటు మదురై పోలీసులు కిలాడీ లేడీ అభినయా కోసం గాలిస్తున్నారు.

English summary
Khiladi: Newly wed bride runs away with gold jewellery and cash in Chennai city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X