Illegal affair: ఎన్ఆర్ఐ మొగుడు, లోకల్ ప్రియుడు, రూ. కోట్లలో ఆస్తి, జీవితాంతం జైల్లోనే !
బెంగళూరు/ఉడిపి/మైసూరు: ఎన్ఆర్ఐ మొగుడితో కాపురం చేస్తున్న భార్య వయసుకు వచ్చిన కొడుకును ఇంట్లో పెట్టుకుని లోకల్ గా ఓ ప్రియుడిని సెట్ చేసుకునింది. వ్యాపారవేత్త అయిన భర్త భారీగా డబ్బులు సంపాధిస్తుంటే కొవ్వు పట్టిన భార్య టిప్పుటాప్ గా రెడీ అవుతూ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. చూడటానికి జెర్సీ ఆవులాగా ఉన్న ఆంటీ ప్రియుడి మోజులో పడి ఎవ్వరిని లెక్కచెయ్యలేదు. కొడుకుకు మాయమాటలు చెప్పిన కిలాడీ లేడీ ఆమె ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి దారుణంగా చంపేసింది. భర్త శవాన్ని హోమంలో వేసి కాల్చిబూడిద చేసిన కిలాడీ లేడి నాటకాలు ఆడింది. వ్యాపారవేత్తను అతని భార్య, ఆమె ప్రియుడు, సొంత కొడుకు హత్య చేశారని కోర్టులో నేరం రుజువు అయ్యింది. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడితో పాటు కొడుకుకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. భర్తను చంపేసి ఆయన ఆస్తితో హ్యాపీగా జల్సా చెయ్యాలని స్కెచ్ వేసిన భార్య ఇప్పుడు జీవితాంతం కటకటాలపాలైయ్యింది.

ఎన్ఆర్ఐ మొగుడు
కర్ణాటకలోని ఉడిపికి చెందిన భాస్కర్ శెట్టి ప్రముఖ వ్యాపారవేత్త. ఉడిపితో పాటు విదేశాల్లో కూడా భాస్కర్ శెట్టిని అనేక హోటల్స్ ఉన్నాయి. వ్యాపారవేత్త భాస్కర్ శెట్టి ఎన్ఆర్ఐ ( NRI).భాస్కర్ శెట్టికి భార్య రాజేశ్వరి శెట్టి అలియాస్ రాజీ , నవనీత్ శెట్టి అనే కొడుకు ఉన్నాడు. ఉడిపిలో ప్రముఖ జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తో చాలా కాలం నుంచి ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

జెర్సీ ఆవులాంటి రాజీని తగులుకున్న జ్యోతిష్యుడు
స్నేహితుడు భాస్కర్ శెట్టి భార్య చూడటానికి ఎర్రగా, బుర్రగా, లావుగా జెర్సీ ఆవులాగా ఉండటంతో చూసితట్టుకోలేకపోయిన జ్యోతిష్యుడు నిరంజన్ భట్ ఆమెకు వలవేశాడు. ఉడిపిలో ఉంటున్న సమయంలో జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తో కలిసే నెపంతో రాజేశ్వరి శెట్టి అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. పగలు లోకల్ ప్రియుడు నిరంజన్ భట్ తో గుట్టుచప్పుడు కాకుండా, రాత్రి ఎన్ఆర్ఐ మొగుడు భాస్కర్ శెట్టితో రాజేశ్వరి శెట్టి చాలా కాలం ఎంజాయ్ చేసింది.

లోకల్ ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య
భర్త భాస్కర్ శెట్టి వ్యాపారం పనుల మీద బయటకు వెళ్లిన సమయంలో రాజేశ్వరి ప్రియుడు నిరంజన్ భట్ తో కులకడం మొదలుపెట్టింది.
లోకల్ ప్రియుడు నిరంజన్ భట్ వ్యామోహంలో మునిగితేలిన రాజేశ్వరి శెట్టి ఓ సారి జ్యోతిష్యుడితో రాసలీలలు సాగిస్తూ భర్త భాస్కర్ శెట్టికి అడ్డంగా చిక్కిపోయింది. భర్త భాస్కర్ శెట్టి వీరలెవల్లో వార్నింగ్ ఇవ్వడంతో రాజేశ్వరి శెట్టి రగిలిపోయింది.

కొడుకుకు మాయమాటలు చెప్పి భర్తను లేపేసింది
మీ నాన్నకు చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆయన బతికుంటే ఆస్తులు మొత్తం వేరేవాళ్లకు వెళ్లిపోతాయని, తరువాత మన బతుకు బస్టాండ్ అయిపోతుందని రాజేశ్వరి శెట్టి కొడుకు నవనీత్ శెట్టికి మాయమాటలు చెప్పింది. 2016 జులై 28వ తేదీని భర్త భాస్కర్ శెట్టిని అతని భార్య రాజేశ్వరి శెట్టి, ఆమె ప్రియుడు నిరంజన్ భట్, కొడుకు నవనీత్ శెట్టి తదితరులు కలిసి అతన్ని దారుణంగా చంపేశారు.

హోమంలో శవం కాల్చేసిన కిలాడీలు
భాస్కర్ శెట్టి శవం పోలీసులకు కూడా చిక్కకుండా చెయ్యాలని జ్యోతిష్యుడు నిరంజన్ భట్, భార్య రాజేశ్వరి శెట్టి తదితరులు స్కెచ్ వేశారు. భాస్కర్ శెట్టి శవాన్ని కారులో ప్రియుడు నిరంజన్ శెట్టి ఇంటికి తీసుకెళ్లి హోమంలో వేసి కాల్చి బూడిద చేసేశారు. వ్యాపారవేత్త భాస్కర్ శెట్టి హత్యకు గురికావడం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అప్పట్లో కలకలం రేపింది. ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి హత్య కేసులో అతని భార్య రాజేశ్వరి శెట్టి, ప్రియుడు నిరంజన్ భట్, ఆమె కొడుకు నవనీత్ శెట్టి. జ్యోతిష్యుడు తండ్రి శ్రీనివాస్ భట్, భాస్కర్ శెట్టి కారుడ్రైవర్ రాఘవేంద్రను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ముగ్గురూ హంతకులే
భాస్కర్ శెట్టి హత్య కేసులో నిరంజన్ శెట్టి, నవనీత్ శెట్టి జైల్లో ఉన్నారు. తరువాత బెయిల్ మీద బయటకు వచ్చిన రాజేశ్వరి శెట్టి భర్త భాస్కర్ శెట్టి ఆస్తులు కొన్ని స్వాధీనం చేసుకుని ఎంజాయ్ చేస్తోంది. పోలీసుల విచారణలో భాస్కర్ శెట్టిని అతని భార్య రాజశేశ్వరి శెట్టి, కొడుకు నవనీత్ శెట్టి, జ్యోతిష్యుడు నిరంజన్ భట్ హత్య చేశారని సాక్షాలు చిక్కాయని ఉడిపి జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్య జూన్ 1వ తేదీన చెప్పారు. బెయిల్ మీద బయట ఉన్న రాజేశ్వరి శెట్టిని కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి సుబ్రమణ్య పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

జీవితాంతం జైల్లోనే
వ్యాపారవేత్త భాస్కర్ శెట్టిని అతని భార్య రాజేశ్వరి శెట్టి, కొడుకు నవనీత్ శెట్టి, రాజేశ్వరి ప్రియుడు నిరంజన్ భట్ హత్య చేశారని నేరం రుజువు అయ్యిందని, నిందితులకు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని న్యాయమూర్తి సుబ్రమణ్య సంచలన తీర్పు చెప్పారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తండ్రి శ్రీనివాస్ శెట్టి ఇప్పటికే ఆనారోగ్యంతో మరణించారు. మరో నిందితుడు కారుడ్రైవర్ రాఘవేంద్ర నేరం చేసినట్లు సాక్షం లేదని అతని కేసు నుంచి విముక్తి చేశారు. కోర్టు ఆదేశాలతో యావజ్జీవ శిక్షకు గురైన రాజేశ్వరి శెట్టిని పోలీసులు జైలుకు పంపించారు.

కిలాడీ మీద హైటెక్ వ్యభిచారం కేసు
గత మార్చి నెల 17వ తేదీన ఉడిపిలోని భాస్కర్ శెట్టి హోటల్ లో అతని భార్య రాజేశ్వరి శెట్టి హెటక్ వ్యభిచారం నిర్వహిస్తున్నదని పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ వ్యభిచారం చేస్తున్న వారిని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులకు చిక్కకుండా రాజేశ్వరి శెట్టి తప్పించుకుంది. అయితే ఐదు సంవత్సరాల క్రితం భర్త భాస్కర్ శెట్టిని హత్య చేసిన కేసులో కిలాడీ లేడీ రాజేశ్వరి శెట్టికి యావజ్జీవ శిక్ష పడటంతో ఆమె జీవితాంతం జైల్లో ఉండాల్సి ఉచ్చింది. అయితే జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును రాజేశ్వరి శెట్టి తదితరులు హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని తెలిసింది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications