నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు: మహిళల వేధింపులపై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా నియ్యమితురాలైన ఖుష్బూ తాజాగా నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు అంటూ మహిళల వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సామాన్యుల జీవితాలలోనే కాదు.. సినీ సెలబ్రిటీల జీవితాలలో, రాజకీయ ప్రముఖుల జీవితాలలో కూడా ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయి. సామాన్యులు మాత్రమే కాదు ప్రముఖుల కుటుంబాలలోను కనిపించని లైంగిక వేధింపులు ఉంటాయి. ఇక ఇదే విషయాన్ని వెల్లడించారు ప్రముఖ సినీ నటి, ఇటీవల జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితురాలైన బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్.

 తండ్రి నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: ఖుష్బూ సుందర్

తండ్రి నుండి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: ఖుష్బూ సుందర్

తెలుగు, తమిళ ప్రేక్షక హృదయాలను ఆకట్టుకొని, తన అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ సుందర్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహిళలకు సంబంధించిన వేధింపులపై మాట్లాడుతూ తన జీవితంలోని షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఖుష్బూ తన చిన్నతనంలో వేధింపులకు గురయ్యానని సంచలన విషయాన్ని చెప్పారు. ఇక తాను తన తండ్రి నుండే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్న ఖుష్బూ తన జీవితంలోని చేదు అనుభవాలను వెల్లడించారు.

 ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి లైంగికంగా వేధించారు, తల్లికి చెప్పినా,.

ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి లైంగికంగా వేధించారు, తల్లికి చెప్పినా,.

తనకు ఎనిమిదేళ్ల వయసు నుండే తండ్రితో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఖుష్బూ సుందర్ చెప్పుకొచ్చారు. తనపై జరుగుతున్న లైంగిక వేధింపులను తన తల్లితో చెప్పినా ఫలితం ఉండేది కాదని, అమ్మ తన మాటలను నమ్మేది కాదని ఖుష్బూ సుందర్ వెల్లడించారు. అప్పట్లో ఇళ్లల్లో మహిళలు భర్త ఏం చేసినా కరెక్ట్ అన్న, పతియే ప్రత్యక్ష దైవం అన్న అభిప్రాయంలో ఉండేవారని, ఇక ఆ భావనతోనే తన తల్లి తన మాటలను పట్టించుకునేది కాదని ఖుష్బూ పేర్కొన్నారు.

తండ్రిపై తిరగబడ్డానని చెప్పిన ఖుష్బూ

తండ్రిపై తిరగబడ్డానని చెప్పిన ఖుష్బూ

చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదురైతే ఆ అమ్మాయి జీవితం నరకంలా ఉంటుందని, తాను అనుభవంతో చెబుతున్నానని ఖుష్బూ పేర్కొన్నారు. ఇక తాను తన తండ్రి తీరుపై తిరుగుబాటు చేశానని పేర్కొన్న ఖుష్బూ, ఆయన వేధింపులు భరించలేక 15 ఏళ్ల వయసు నుండి తన తండ్రి పై తాను తిరగబడ్డానని చెప్పారు. తన 16వ ఏట తన తండ్రి మరణించాడని పేర్కొన్న ఖుష్బూ, అప్పుడు తమ పరిస్థితి దయనీయంగా ఉండేదని, కనీసం పూట గడవని పరిస్థితి ఇంట్లో ఉండేదని చెప్పుకొచ్చారు.

సమస్యలు వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలి

సమస్యలు వచ్చినప్పుడు మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలి

అప్పట్లో మగవాళ్ళు భార్యలను తిట్టడం కొట్టడం, పిల్లలను వేధించడం, ఆడపిల్లలను సైతం నోటికొచ్చినట్టు తిట్టడం తమ జన్మ హక్కుగా భావించేవారని ఖుష్బూ చెప్పుకొచ్చారు. తాజాగా తన తండ్రి గురించి షాకింగ్ విషయం వెల్లడించిన ఖుష్బూ సమాజంలో నేటి కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పుకొచ్చారు. మహిళలు సమస్యలు వచ్చినప్పుడు, లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడాలని సూచించారు.

 జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మహిళల కోసం పని చెయ్యనున్న ఖుష్బూ

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మహిళల కోసం పని చెయ్యనున్న ఖుష్బూ

ఇదిలా ఉంటే జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సినీనటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్ కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక పదవిని ఇచ్చింది. ఈ పదవిలో ఖుష్బూ సుందర్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ అయిన ఖుష్బూ సుందర్ దేశవ్యాప్తంగా మహిళల సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖుష్బూ సుందర్ దేశంలోని మహిళల రక్షణ కోసం తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని, మహిళల రక్షణ కోసం పని చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+