Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుదుచ్చేరి గవర్నర్‌ పదవి నుంచి కిరణ్ బేడీ తొలగింపు: తమిళిసైకి అదనపు బాధ్యతలు

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పుదుచ్చేరిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కొనసాగుతున్న కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది.

ఇది ఇలావుంటే, పుదుచ్చేరిలో నెల రోజుల వ్వవధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. దీంతో పార్టీ బలం మెజార్టీ మార్కు దిగువకు చేరడంతో పుదుచ్చేరి ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

 Kiran Bedi removed as Lieutenant Governor of Puducherry amid crisis in Congress govt

ఈ క్రమంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, ఆ బాధ్యతలను తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ పదవి నుంచి డాక్టర్ కిరణ్ బేడీని తొలగిస్తూ రాష్ట్రపతి ఆదేశించారని, ఆ విధులను నిర్వహించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించారని పెసిడెంట్ సెక్రటరీ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. కిరణ్ బేడీ తన బాధ్యతల నుంచి వైదొలిగిన వెంటనే తమిళిసై ఆ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+