విజయ్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట!

తమిళనాడులోని అధికార 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు టీవీకే అధినాయకత్వం 'గుర్రాల బేరాలకు' (Horse-Trading) పాల్పడుతోందంటూ, దీనిపై సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరిస్తూ.. ఇందులో పేర్కొన్న అంశాలన్నీ ఎటువంటి ఆధారాలు లేని "అస్పష్టమైన ఆరోపణలు" అని తేల్చిచెప్పింది.

మదురైకి చెందిన కేకే రమేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలు అవినీతి, బెదిరింపులకు పాల్పడుతూ విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాయని, దీనిపై కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది జె.ఆర్. సుకిన్ వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. "ఈ రిట్ పిటిషన్ ఎటువంటి ఆధారాలు లేని అస్పష్టమైన, ఊహాజనిత, సాధారణ ఆరోపణలపై ఆధారపడి ఉంది. దీనిని విచారించడానికి మాకు ఎలాంటి బలమైన కారణాలు కనిపించడం లేదు" అని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Supreme Court Rejects CBI Probe Against TVK Dismisses Plea Over Alleged Horse Trading in Tamil Nadu

మద్రాస్ హైకోర్టులోనూ అదే షాక్!

అంతకుముందు మంగళవారమే ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు కూడా కీలక తీర్పునిచ్చింది. తమిళనాడులో నలుగురు ఏఐఏడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార టీవీకే పార్టీలో చేరడం వెనుక భారీ అవినీతి జరిగిందని, సీబీఐ దర్యాప్తు కావాలని దాఖలైన పిల్ (PIL) ను చీఫ్ జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌ల ధర్మాసనం కొట్టివేసింది.

ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్
ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్

ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక ఏదైనా అవినీతి లేదా అక్రమాలు జరిగాయని చెప్పడానికి కనీస సాక్ష్యాధారాలు లేవని, కేవలం అనుమానాలతో సీబీఐ విచారణకు ఆదేశించలేమని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్ దాఖలు చేసిన ఈ పిల్ కేవలం 'సస్పెన్స్ ఆధారిత ఊహాగానాలే' (Fishing Expedition) తప్ప ఇందులో వాస్తవాలు లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కారుణ్య నియామకాల్లో వివాహిత కుమార్తెలు.. సుప్రీం చారిత్రాత్మక తీర్పు
కారుణ్య నియామకాల్లో వివాహిత కుమార్తెలు.. సుప్రీం చారిత్రాత్మక తీర్పు

రాజకీయాలు మారినంత మాత్రాన అవినీతి కాదు..

సీబీఐ వంటి అపెక్స్ ఏజెన్సీలకు విచారణ అప్పగించే అసాధారణ అధికారాన్ని అత్యంత అరుదైన కేసుల్లో, ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడే ఉపయోగించాలని కోర్టులు స్పష్టం చేశాయి. అంతేకాకుండా, కేవలం రాజకీయ విధేయతలు మారినంత మాత్రాన, ఎటువంటి క్విడ్ ప్రో కో ఆధారాలు లేకుండా 'అవినీతి నిరోధక చట్టం' కింద అది క్రిమినల్ నేరం కాబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఉప ఎన్నికలు వచ్చి ఆర్థిక భారం పడవచ్చు కానీ, దానికి క్రిమినల్ రంగు పూయలేమని మద్రాస్ హైకోర్టు పేర్కొన్న తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+