KL Rahul : ఐపీఎల్ 2023 నుంచి కేఎల్ రాహుల్ అవుట్- కారణమిదే..!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతున్న కేఎల్ రాహుల్ ఇప్పుడు మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయం కారణంగా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న రాహుల్.. జట్టును గెలిపించేందుకు చివరి బ్యాట్స్ మెన్ గా మైదానంలో అడుగుపెట్టినా అప్పటికే చేజారిపోయిన మ్యాచ్ ను గట్టెక్కించలేకపోయాడు. దీంతో రాహుల్ గాయం తీవ్రతను పరిశీలించిన జట్టు యాజమాన్యం, బీసీసీఐ.. అతనికి విశ్రాంతి ఇచ్చేందుకే మొగ్గు చూపింది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టును కెప్టెన్ గా బాగానే ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ వ్యక్తిగతంగా అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో కేఎల్ రాహుల్ విఫలమవుతున్నాడు. దీంతో రాహుల్ ప్రదర్శనపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అభిమానులు కూడా నిరాశలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాహుల్ రాయల్స్ ఛాలెంజర్స్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. కుడికాలికి గాయం కావడంతో రాహుల్ బ్యాటింగ్ కు దిగరాదని భావించాడు. కానీ తప్పనిసరి పరిస్ధితుల్లో క్రీజులోకి వచ్చినా ఫలితం లేకపోయింది.

 klrahul-

వచ్చే నెల 7 నుంచి 11వరకూ లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో కేఎల్ రాహుల్ తప్పనిసరిగా ఆడాలని బీసీసీఐ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో కాలి గాయంతో ఐపీఎల్ సీజన్ ను కంటిన్యూ చేస్తే అది మరింత తీవ్రమవుతుందని ఆందోళన చెందుతోంది. దీంతో ఈ స్టార్ బ్యాట్స్ మెన్ కమ్ వికెట్ కీపర్ కు విశ్రాంతి నివ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లక్నో జట్టులోనే కేఎల్ రాహుల్ తో పాటు గాయంతో బాధపడుతున్న పేసర్ జయదేవ్ ఉనద్కత్ తాజా పరిస్ధితిని బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్నోలో జట్టుతోనే ఉన్న రాహుల్ ఇవాళ సాయంత్రం చెన్నైతో జరిగే మ్యాచ్ ను డగౌట్ నుంచే వీక్షించబోతున్నాడు. అనంతరం జట్టుకు వీడ్కోలు చెప్పి ముంబైలో బీసీసీఐ నియమించిన డాక్టర్ల సమక్షంలో స్కానింగ్స్ చేయించుకుంటాడని తెలుస్తోంది. అదే సమయంలో రాహుల్ తో పాటు ఉనద్కత్ కు కూడా స్కానింగ్ నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+