కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం..మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆస్తులపై సీబీఐ దాడులు!

కోల్కత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో వైద్యురాలి హత్యాచారం తర్వాత రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. వైద్యురాలి హత్యాచారం, ఆ తర్వాత జరిగిన ఘటనలో ఈ కేసు వెనక మెడికల్ మాఫియా ఉందన్న అనుమానాలకు కారణంగా మారాయి. ఇప్పటికే ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న సిబీఐ ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలోని అవినీతి ఆరోపణల వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.
దర్యాప్తును వేగవంతం చేసింది.

ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ పై కేసు
ఆర్జీ కర్ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు చెందిన ఆస్తులపైన నేడు దాడులు నిర్వహించింది. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. ఆర్జి కర్ మెడికల్ కళాశాలలో జరిగిన ఆర్థిక అవకతవకల పైన దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఇప్పటికే అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించి సందీప్ ఘోష్ పై కేసులు నమోదు చేసింది.

kolkata doctor rape murder case CBI rides on ex principal sandeep ghosh properties

సంజయ్ ఘోష్ ఆస్తులపై సీబీఐ ఫోకస్
ఆది నుంచి ఈ కేసులో మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని పలు దఫాలు విచారించిన సిబిఐ ఆర్జి కర్ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుంది అన్నది కనిపెట్టే పనిలో భాగంగా రంగంలోకి దిగింది. ప్రస్తుతం మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆస్తుల పైన ఫోకస్ చేసిన సిబిఐ నేడు ఏకకాలంలో దాడులు చేసి దర్యాప్తును కొనసాగిస్తుంది.

దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ
ఇదిలా ఉంటే ఈ కేసులో మూడు వారాలలోగా దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సమర్పించాలని న్యాయస్థానం సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఢిల్లీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శనివారం రోజు నిందితుడి తో పాటు మరో నలుగురికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. అసలు ఈ హత్యాచారం వెనుక జరిగింది ఏంటి అన్న కోణంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.

ఇంకా కొనసాగుతున్న ఆందోళనలు
ఇదిలా ఉంటే కోల్ కత్తాలో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్‌కతాలో డాక్టర్ అత్యాచారం-హత్యతో ఆర్‌జి కర్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా సైకాలజీ విద్యార్థులు నిన్న కూడా నిరసన చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు గురైన ఘటనకు నిరసనగా కోల్‌కతాలోని క్యాబ్ సర్వీసుల డ్రైవర్లు కూడా నిన్న ర్యాలీని నిర్వహించారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+