చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: కూరగాయల లారీలో వెళ్లిన కంప్యూటర్ ఆపరేటర్, కరోనా పాజిటివ్, లేడీ దెబ్బకు 82 మందికి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోవిల్ పట్టి: లాక్ డౌన్ కారణంగా సొంత ప్రాంతాలు చేరుకోవడానికి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో ప్రజలు వారి గమ్యస్థానాలు చేరుకోవడానికి పడరానిపాట్లు పడుతున్నారు. చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ నుంచి బయలుదేరిన వాహనంలో ప్రయాణించిన లేడీ కంప్యూటర్ ఆపరేటర్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. 18 నెలల బాలుడితో సహ మొత్తం 82 మందితో ఆ యువతి చనువుగా ఉన్నదని వెలుగు చూసింది. ఈ విషయం బయటకు రావడంతో మహిళతో చనువుగా ఉన్న 82 మందితో పాటు తమిళనాడు ప్రభుత్వం, అధికారులు హడలిపోయారు.

Lockdown చాన్స్: బ్యూటీషియన్ ఆంటీతో లవ్, అడిగినంత డబ్బు, భార్య బంధువు, తెగనరికి. పెట్రోల్ !Lockdown చాన్స్: బ్యూటీషియన్ ఆంటీతో లవ్, అడిగినంత డబ్బు, భార్య బంధువు, తెగనరికి. పెట్రోల్ !

 లాక్ డౌన్ లో యువతి లాక్

లాక్ డౌన్ లో యువతి లాక్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చెన్నైలో వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటకు వస్తున్న సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు తీవ్ర ఆందోళనకు గురైనారు. చెన్నైలోని అధనూర్ ప్రాంతంలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్న యువతి సైతం సొంత ఊరికి వెళ్లలేక లాక్ డౌన్ లో అక్కడే చిక్కుకుపోయింది.

 కరోనా హాట్ స్పాట్ నుంచి లారీ

కరోనా హాట్ స్పాట్ నుంచి లారీ

చెన్నై సిటీలోని కోయంబేడూ కూరగాయల మార్కెట్ కరోనా హాట్ స్పాట్ గా మారడంతో ఇప్పటికే ఆ మార్కెన్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కోయంబేడు కూరగాయల మార్కెట్ లో కేవలం 200 మంది షాపుల్లో మాత్రమే వ్యాపారాలు చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఇదే మార్కెట్ నుంచి కూరగాయాలు లోడ్ చేసుకున్న లారీ అక్కడి నుంచి కోవిల్ పట్టి ప్రాంతానికి బయలుదేరింది.

 సోదరుడు చెప్పాడని లారీ ఎక్కిన యువతి

సోదరుడు చెప్పాడని లారీ ఎక్కిన యువతి

లాక్ డౌన్ లో చిక్కుకున్న యువతిని ఎలాగైన సొంత గ్రామానికి తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కోయంబేడు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకువస్తున్న లారీలో నువ్వు బయలుదేరి రావాలని, ఆ లారీ డ్రైవర్ తో తాను ఇంతకు ముందే మాట్లాడానని, ఎలాంటి సమస్యలు ఉండవని అధనూర్ ప్రాంతంలో ఉంటున్న యువతికి ఆమె సోదరుడు ఫోన్ చేసి చెప్పాడు. సోదరుడు చెప్పాడు కదా అని ఆ యువతి కోయంబేడూ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని బయలుదేరిన లారీ ఎక్కి సొంత గ్రామానికి బయలుదేరింది.

 స్థానికులు సమాచారం ఇవ్వడంతో !

స్థానికులు సమాచారం ఇవ్వడంతో !

కోవిల్ పట్టి సమీపంలోని కేజీ కండ్రిగనకు ఆ యువతి చేరుకుంది. చెన్నై నుంచి యువతి వచ్చిందని తెలుసుకున్న చుట్టుపక్కల వారు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి యువతిని ఎక్కడి నుంచి వచ్చారు ? అని ప్రశ్నించారు. తాను నెల రోజుల క్రితమే ఇంటికి వచ్చానని ఆమె సమాధానం చెప్పింది. వెంటనే అంబులెన్స్ ఎక్కి వచ్చి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. అయితే ఆమె కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించింది. అధికారులు బలవంతంగా ఆమెను అంబులెన్స్ లో తీసుకెళ్లి కరోనా వైద్యపరీక్షలు చేయించారు.

Recommended Video

Vande Bharat Operation: Special Flights with Indian Nationals From UAE Landed at Kochi
 యువతి దెబ్బకు 82 మంది క్వారంటైన్ లో !

యువతి దెబ్బకు 82 మంది క్వారంటైన్ లో !

చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్ నుంచి బయలుదేరిన లారీలో ప్రయాణించిన యువతికి కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది. ఆ యువతితో పాటు 18 నెలల బాలుడు, ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారు మొత్తం 82 మంది సన్నిహితంగా మెలిగారని అధికారులు గుర్తించారు. 18 నెలల బాలుడితో సహ మొత్తం 82 మందికి కరోనా వైద్యపరీక్షలు చేయించి వారిని క్వారంటైన్ కు తరలించారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి యువతిని చెన్నై నుంచి అక్రమంగా కోవిల్ పట్టికి తీసుకు వచ్చిన లారీ డ్రైవర్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

English summary
Coronavirus Lockdown: kovilpatti young girl travels in vegetable lorry from Chennai Koyambedu and test positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X