బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

CM race: దూసుకుపోతున్న ట్రబుల్ షూటర్, బాస్ తో అంత క్లోజ్ గా, సీఎం ఎవరు మిత్రమా ? ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: సీఎం కావాలని రాజకీయాల్లో ఉన్న వారిలో ఎవరికి మాత్రం ఆశ ఉండదు చెప్పండి. అయితే జాతీయ పార్టీలో తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దూసుకుపోతున్నారు. మాజీ సీఎంను సైతం లెక్క చెయ్యకుండా ఆయన పని ఆయన చేసుకుని వెలుతున్నారు. మాజీ సీఎం రేస్ లో ఉన్నా సరే నా సత్తా నేను చూపించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో కొన్ని ఫోటోలు వైరల్ కావడం కలకలం రేపింది. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎవరి మీద ఎవరు చేతులు వేసుకుని ఫోటోలు తీసుకున్నారు ?, కాబోయే సీఎం ఎవరు ? అని ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా ? !girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా ? !

 అసెంబ్లీ ఎన్నికలు

అసెంబ్లీ ఎన్నికలు

కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాలు రసవత్తరంగా మారిపోయాయి. కర్ణాటకలో ఎవరు అధికారంలోకి వస్తారా ? అని అందరూ ఎదురు చూస్తున్నారు. బలంగా ఉన్న మూడు పార్టీల్లో రాజకీయ వ్యూహకర్తల గురించి చర్చలు జరుగుతున్నాయి. అధికార బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు ? అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 లీడర్స్ ఎంట్రీతో ?

లీడర్స్ ఎంట్రీతో ?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత వారం కర్ణాటకలో పర్యటించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ వారం పర్యటించారు. జనవరి 11న కాంగ్రెస్ బస్సుయాత్ర ప్రారంభించనుంది. ఉత్తర కర్ణాటకలోని హుబ్లీ, విజయపూర్లలో ఇప్పటికే భారీ సదస్సును నిర్వహించింది. పంచరత్న యాత్రలో జేడీఎస్ బిజీబిజీగా ఉంది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నేతలలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముందు వరుసలో ఉన్నారు.

 సీఎం అభ్యర్థి ఎవరు ?

సీఎం అభ్యర్థి ఎవరు ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది ప్రతిష్టగా తీసుకున్న డీకే శివకుమార్ అమితుమి తేల్చుకోవడానికి సిద్దం అయ్యారు. అనేక సాంకేతికతలలో నిమగ్నమైన డీకే శికుమార్ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనే కోరికతో పని చేస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత చరిష్మా పెంచుకోవడంలో డీకే శివకుమార్ బిజీగా ఉన్నారు. అనేక సభలు, వేడుకలు, నిరసనలు, యాత్రలకు డీకే శివకుమార్ నాయకత్వం వహిస్తున్నాడు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే అని పరోక్షంగా డీకే. శివకుమార్ తేల్చిచెబుతున్నారు.

 గాంధీ ఫ్యామిలీకి ఆపద వచ్చిన టైమ్ లో ?

గాంధీ ఫ్యామిలీకి ఆపద వచ్చిన టైమ్ లో ?

గాంధీ కుటుంబంతో డీకే శివకుమార్ కు సన్నిహిత అనుబందాలు ఉన్నాయి. డీకే .శివకుమార్ కాంగ్రెస్ వాది. గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు డీకే శివకుమార్ ఆదుకున్నారు. పార్టీ కోసం ఆయన ఆస్తులు కూడా విక్రయించి పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. అలా గాంధీ కుటుంబానికి డీకే శివకుమార్ చాలా సన్నిహితుడిగా మారిపోయారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా డీకే శివకుమార్ కు సన్నిహితుడే.

 ఢిల్లీ వెళ్లి డీకే ఏం చేశాడంటే ?

ఢిల్లీ వెళ్లి డీకే ఏం చేశాడంటే ?

జనవరి చివరి వారంలోగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలనే లక్ష్యంతో డీకే శివకుమార్ ఉన్నారు. ఈ నేప‌థ్యంలో జాతీయ నేత‌లు చ‌ర్చించేందుకు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. హర్యానాలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో స‌న్నిహితంగా ఉన్న ఫోటోను డీకే శివకుమార్ షేర్ చేశారు. ఇందులో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని నిల్చున్నారు. ఒకవేళ కాంగ్రెస్ మెజారిటీతో అధికారంలోకి వస్తే డీకే శివకుమార్ కు రాహుల్ అండగా నిలుస్తారని వెలుగు చూసింది.

 డీకే మీద పలు కేసులు

డీకే మీద పలు కేసులు

డీకే శివకుమార్‌ మీద అక్రమ ఆస్తులు సంపాధించారని, అక్రమంగా నగదు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలన్నీ డీకే శివకుమార్ వెంటపడ్డాయి. సీబీఐ. ఈడీ అధికారులు సైతం ఇప్పటికే అనేకసార్లు డీకే శివకుమార్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో మనీలాండరింగ్ కేసులో డీకే శివకుయార్ జైలు పాలయ్యారు. తరువాత డీకే శివకుమార్ బెయిల్ మీద బయటకు వచ్చారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో పోటీలో ఉన్నారు. ఇదే సంవత్సరంలో కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుంది ?, ఎవరు సీఎం అవుతారు ? అనే విషయంలో ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

English summary
KPCC President DK Shivakumar, who took close photos with Rahul Gandhi, is in the first place in the CM race?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X