ఉచితం ప్రయాణం వేళ.. RTC సూపర్ న్యూస్

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఛార్జీలను భారీగా తగ్గించింది. ప్రీమియం క్లాస్ బస్సుల్లో ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ నెల 5వ తేదీన అమలులోకి వచ్చిన ఈ తగ్గింపు మూడు నెలల పాటు అంటే మార్చి వరకు కొనసాగుతుంది. వారంలో నాలుగు రోజులు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో అందుబాటులో ఉంటుంది. రద్దీ అధికంగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో ఈ తగ్గింపు ఉండదు. ఈ మూడు రోజుల్లో యధాతథ ఛార్జీని వసూలు చేస్తారు.

తక్కువ డిమాండ్ ఉండే సీజన్‌లో ప్రయాణీకులను ఆకట్టుకోవడానికి, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడానికి ఎంపిక చేసిన మార్గాల్లో ఈ తగ్గింపును ప్రకటించింది కేఎస్ఆర్టీసీ. ప్రస్తుతం ఉన్న ప్రయాణ ఛార్జీలో 5 నుండి 15 శాతం వరకు తగ్గించింది. బెంగళూరు, మైసూరు, మంగళూరు, దావణగెరె డివిజన్లలోని అన్ని ప్రధాన ప్రీమియం బస్సు సేవలకు వర్తిస్తుంది.

KSRTC Slashes Ticket Prices on Selected Buses

తిరుపతి, హైదరాబాద్, చెన్నై, పుదుచ్చేరి వంటి ప్రముఖ నగరాలకు నడిచే అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిచే 'ఫ్లై బస్' సేవలకు కూడా రాయితీలు వర్తిస్తాయి. బెంగళూరు-మంగళూరు, బెంగళూరు-కుందాపుర, బెంగళూరు-పూణే, బెంగళూరు-ముంబై వంటి పలు కీలక మార్గాలతో పాటు కర్ణాటకలోని వివిధ గమ్యస్థానాలు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అనేక బస్సు మార్గాలలో టిక్కెట్ ధరలు తగ్గాయి.

బెంగళూరు-ఉడుపి, బెంగళూరు-ధర్మస్థల, బెంగళూరు-కుక్కేసుబ్రహ్మణ్య, బెంగళూరు-పుత్తూరు, బెంగళూరు-మడికేరి, బెంగళూరు-విరాజ్‌పేట, బెంగళూరు-దావణగెరె, బెంగళూరు-శివమొగ్గ, బెంగళూరు- సాగర రూట్లు ఉన్నాయి. బెంగళూరు-చెన్నై, బెంగళూరు-హైదరాబాద్/సికింద్రాబాద్, బెంగళూరు-తిరుపతి, బెంగళూరు-చెన్నై, బెంగళూరు-కోయంబత్తూరు, బెంగళూరు-త్రిస్సూర్ వంటి అంతర్రాష్ట్ర మార్గాలలోనూ ఈ రాయితీ లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 5 నుండి అమల్లోకి వస్తుంది.

బెంగళూరు ఎయిర్ పోర్ట్-కుందాపుర మార్గంలో రూ. 2,300 నుండి రూ. 2,000కి తగ్గింది. బెంగళూరు- షిర్డి, బెంగళూరు- ముంబై మార్గంలో వెళ్లే ప్రీమియం బస్సు ఛార్జీలు రూ. 2,500 నుండి రూ. 2,000, బెంగళూరు-పూణే రూ. 2,300 నుండి రూ. 1,700కు తగ్గాయి. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేసారి ముందస్తు బుకింగ్ చేసుకున్నా కూడా వారికి టికెట్ ధరపై అయిదు శాతం రాయితీ లభిస్తుంది.

అలాగే- ఒకవైపు, రెండు వైపులా ప్రయాణానికి సంబంధించిన బుకింగ్‌లను ఒకేసారి చేస్తే, ప్రయాణ ఛార్జీలపై 10 శాతం తగ్గింపును అందిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. వోల్వో, అంబారీ, క్లబ్ క్లాస్, పల్లకి ఉత్సవ్, ఫ్లై బస్, రాజహంస, నాన్-ఏసీ స్లీపర్, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఏసీ స్లీపర్, మల్టీ-యాక్సిల్ ఏసీ స్లీపర్ వంటి ప్రముఖ బస్సుల్లోని ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్ ఛార్జీలు 5 నుంచి 15 శాతం వరకు తగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+