వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ 15 రోజుల్లో బలం నిరూపించుకోమన్నారు: కుమారస్వామి, ప్రమాణ స్వీకారానికి బాబు, కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వాజుబాయి వాలా ఆహ్వానించారని జేడీఎస్ అధినేత కుమారస్వామి శనివారం చెప్పారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కూర్పుపై రేపు కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామన్నారు.

జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయమని తాము చెప్పగా, గవర్నర్ ఆహ్వానించారన్నారు. అసెంబ్లీలో బీజేపీ బలం నిరూపించుకోలేకపోయిందని చెప్పారు.

Kumara Swamy swearing to turn into a day of all the opposition parties coming together

ఆయన గవర్నర్‌తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. సోమవారం ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులతో పాటు మాయావతి, మమతా బెనర్జీలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు. 15 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారన్నారు.

Kumara Swamy swearing to turn into a day of all the opposition parties coming together

బీజేపీ ఆపరేషన్ మొత్తం తెలుసునని చెప్పారు. కాంగ్రెస్, జేడీఎస్ సమన్వయం కోసం సమన్వయ నియమించినట్లు చెప్పారు. కుమారస్వామి కంఠీరవ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమారస్వామి తన ప్రమాణ స్వీకారానికి ప్రాంతీయ పార్టీల అధినేతలను ఆహ్వానించడం గమనార్హం.

English summary
JDS leader Kumara Swamy swearing to turn into a day of all the opposition parties coming together.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X