మోనాలిసాకు ఊహించని షాక్: భర్తపై పోక్సో కేసు
మహాకుంభమేళాలో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది 'మోనాలిసా'. ఆమె అందం, ఆహార్యం చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే, ఆ పాపులారిటీయే ఇప్పుడు ఆమెను, ఆమె భర్తను చిక్కుల్లో పడేసింది.
మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కుంభమేళాలో ఒక సెలబ్రిటీ హోదాను అనుభవించిన ఆమెపై తాజాగా వచ్చిన ఒక ఆరోపణ మొత్తం కథను మార్చేసింది. మోనాలిసా అసలు వయసు ఎంత? ఆమె మైనరా లేక మేజరా? అనే సందేహాలు మొదలయ్యాయి.

రంగంలోకి NCST.. తేలిన అసలు నిజం!
ఈ వ్యవహారంపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) ప్రత్యేక దృష్టి సారించింది. మోనాలిసా గిరిజన సామాజిక వర్గానికి చెందిన యువతి కావడంతో, ఆమె వయసుపై విచారణ చేపట్టింది. అధికారుల దర్యాప్తులో షాకింగ్ నిజం బయటపడింది. మోనాలిసా ఇంకా మైనర్ అని, చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు ఆమెకు లేదని అధికారికంగా నిర్ధారణ అయ్యింది.
భర్పపై పోక్సో కేసు నమోదు
మోనాలిసా మైనర్ అని తేలడంతో, ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మైనర్ బాలికను వివాహం చేసుకోవడం, లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO) కింద నేరం కావడంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఒక్కరోజు క్రితం వరకు సెలబ్రిటీలుగా చలామణి అయిన ఈ జంట, ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుంది.
సోషల్ మీడియాలో చర్చ
కుంభమేళాలో మోనాలిసాను చూసి మురిసిపోయిన నెటిజన్లు, తాజా పరిణామాలతో షాక్‌కు గురవుతున్నారు. "చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని కొందరు అంటుంటే, "తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకున్నారు" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఫర్మాన్ ఖాన్‌ను విచారిస్తున్నారు. మోనాలిసాను సంరక్షణ కేంద్రానికి తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వైరల్ వీడియో ఒకరి జీవితాన్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో, చట్టపరమైన లోపాలు ఉంటే అంతే వేగంగా కిందకు పడేస్తాయని ఈ ఘటన నిరూపించింది.












Click it and Unblock the Notifications