కుప్వారా గ్యాంగ్ రేప్, హత్య: నలుగురికి మరణ శిక్ష
శ్రీనగర్: జమ్మూ కాశ్మీరులోని కుప్వారా ప్రాంతంలో 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఆమెను హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు కోర్టు శుక్రవారంనాడు మరణశిక్ష విధించింది. పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా 13 ఏళ్ల అమ్మాయిపై 2007లోల నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు.
ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిణగిస్తూ దోషులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు మొదటి నుంచీ కోరుతున్నారు. నిందితులు సాదిక్ మీర్, అజర్ అహ్మద్ మీర్ లాంగాటే ప్రాంతానికి చెందినవారు కాగా, మరో ఇద్దరు జహంగీర్ అన్సారీ పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. మరో నిందితుడు సురేష్ కుమార్ రాజస్థాన్‌కు చెందినవాడు.

నలుగురు నిందితులను కూడా కోర్టు ఏప్రిల్ 18వ తేదీన దోషులుగా నిర్ధారించింది. ఆ అమ్మాయి హత్యోదంతం కాశ్మీర్ లోయలో తీవ్ర సంచలనం సృష్టించింది. పెద్ద యెత్తున నిరసన ప్రదర్శనలు చెలరేగాయి.
నలుగురు కూడా 2007 ఆగస్టు నుంచి జైలులోనే ఉన్నారు. కోర్టు 86 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఆ 13 ఏళ్ల బాలిక పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం శౌర్య పతకాన్ని నెలకొల్పింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications