కువైట్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, కీలక ఆదేశాలు: 49కి చేరిన మృతులు

కువైట్‌లో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో బాధితులైన భారతీయులకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

బుధవారం సాయంత్రం ప్రధాని మోడీ నివాసంలో కువైట్‌లో పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ క్రమంలో కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌‌ను ఆదేశించారు. మరోవైపు, హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు.

Kuwait Fire accident PM Modi Expresses Grief Over Death Of 49 Assures Support to Victims

హెల్ప్ లైన్ నెంబర్

కువైట్‌లో నివసిస్తున్న వారి బంధువుల సహాయం కోసం కువైట్‌లోని భారతీయ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్ +965-65505246 కూడా షేర్ చేసారు.

కాగా, అంతకుముందు ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరం. నా ఆలోచనలు తమ సన్నిహితులను, ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో ఉన్నాయి. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. బాధిత వ్యక్తులకు సహాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి పని చేస్తోంది' అని పేర్కొన్నారు.

కువైట్‌లోని దక్షిణ మంగాస్ జిల్లాలో బుధవాంర తెల్లవారుజామున సంభవించిన ఈ భారీ అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మంది భారతీయ కార్మికులు మరణించారు. మరో 40 మందికి పైగా భారతీయ కార్మికులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కువైట్ ఘటనపై సమాచారం అందగానే ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

మరోవైపు, ఏపీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం, ఒడిశాలో మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరైన మోడీ.. హుటాహుటిన ఢిల్లీకి చేరుకుని కువైట్ ప్రమాదంపై అధికారులతో సమీక్ష జరిపారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ను కువైట్ వెళ్లాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మృతుల్లో ఎక్కువగా కేరళ, తమిళనాడు వాసులు ఉన్నట్లు సమాచారం.

కాగా, కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 మందికిపైగా మరణించారని, మరో 50 మందికిపైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారత ఎంబసీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. ప్రమాదంపై కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+