Lady: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్త, కవల పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది, రాత్రి !

చెన్నై/ పెరంబలూరు: భర్తకు దూరంగా ఉంటున్న భార్య ఆమె ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త దూరంగా ఉన్నాడని ఆవేదనతో ఆవేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాత్రి భోజనం చేసి నిద్రపోయిన కవల పిల్లలు ఉదయం ఇంట్లోనే శవాలైనారు. రాత్రి నిద్రపోయిన తల్లీ, కవల పిల్లలు వారి రూమ్ లోనే ఒకేసారి శవాలు కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

 హ్యాపీలైఫ్

హ్యాపీలైఫ్

తమిళనాడులోని పెరంబూరు జిల్లాలోని మంగళమేడు సమీపంలోని బెన్నకోణం గ్రామానికి చెందిన కన్నన్, తమిళ చెల్వి దంపతులకు వినోద్‌కుమార్‌, విజయకుమార్‌ ఇద్దరు కుమారులు. వినోద్‌కుమార్‌ మూడు సంవత్సరాల క్రితం ప్రియా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వినోద్ కుమార్, ప్రియా దంపతులకు నికిత (2), నికిషా (2) అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. విజయ్ కుమార్ కు జయా అనే మహిళతో వివాహం అయ్యింది.

 విదేశాల్లో భర్త

విదేశాల్లో భర్త

వినోద్‌కుమార్, విజయకుమార్ విదేశాల్లో పనిచేస్తున్నారు. వినోద్‌కుమార్‌ తల్లి తమిళచెల్వి, భార్య ప్రియా, విజయకుమార్‌ భార్య జయా, పిల్లలు నికిత, నికిషాలు పెన్నకోణం గ్రామంలో నివసిస్తున్నారు. గత కొన్ని నెలలుగా కడలూరు జిల్లా రామనాథం గ్రామంలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్న ప్రియా వారం రోజుల క్రితం పిల్లలతో కలిసి పెన్నగోనం గ్రామానికి వచ్చింది.

 ఉరి వేసుకున్న తల్లి

ఉరి వేసుకున్న తల్లి

శుక్రవారం రాత్రి ప్రియా ఆమె పిల్లలతో కలిసి భోజనం చేసి ఆమె రూమ్ లోకి వెళ్లింది. గదిలో రాత్రి నిద్రిపోయారు. ఉదయం పిల్లలతో కలసి నిద్ర పోతున్న ప్రియా రూమ్ లో నుంచి బయటకు రాలేదు. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ప్రియా ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది.

 కవల పిల్లలకు విషం పెట్టి హత్య చేసిన తల్లి

కవల పిల్లలకు విషం పెట్టి హత్య చేసిన తల్లి

ఇద్దరు అమ్మాయిలు నికిత, నికిషాల నోటి నుంచి నురగలు కక్కుతూ మృతి చెందిన విషయం గమనించి అందరూ హడలిపోయారు. మేళమేడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పెరంబలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిల్లలిద్దరికీ విషమిచ్చి ప్రియా ఆత్మహత్య చేసుకుందని, ఎందుకు ఇలా చేసింది అని కచ్చితమైన సమాచారం తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+