Lady: ప్రైవేట్ పార్ట్ లో ఇనుపరాడ్, గ్యాంగ్ రేప్ కేసులో ఊహించని ట్విస్ట్, కిలాడి ఏం చేసింది ?, ఏం చెప్పింది ?
గాజియాబాద్: గాజియాబాద్ లో వివాహిత మహిళ మీద గ్యాంగ్ రేప్ జరిగిందని, ఆమె ప్రైవేట్ పార్ట్ లో ఇనుప రాడ్ చెక్కేశారని వెలుగు చూడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పనిమీద వెళ్లిన తరువాత నేను రాత్రి ఇంటికి బయలుదేరానని, ఆ సందర్బంలో ఐదు మంది తనను కారులో కిడ్నాప్ చేశారని, ఓ ఇంటిలోకి ఎత్తుకుని వెళ్లి తన మీద సామూహిక అత్యచారం చేశారని ఢిల్లీకి చెందిన ఓ మహిళ కేసు పెట్టింది. తనను రెండు రోజుల పాటు ఇంటిలో నిర్బందించి పదేపదే సామూహిక అత్యాచారం చేశారని, తరువాత ప్రైవేటు పార్ట్ లో ఇనుప రాడ్ చెక్కేసి కారులో పిలుచుకుని వెళ్లి రోడ్డు పక్కన తోసేసి వెళ్లిపోయారని మహిళ పోలీసు కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో గాజియాబాద్ పోలీసులకు నోటీసులు ఇచ్చామని ఇప్పటికే ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మాళివాలే ట్విట్ చేశారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయని పోలీసు అధికారులు చెప్పడంతో కేసు మలుపుతిరిగింది.

ఢిల్లీ లేడీ
ఢిల్లీలో 40 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్త, పిల్లలతో కలసి నివాసం ఉంటున్నది. పనిమీద వెళ్లిన తాను రాత్రి గాజియాబాద్ నుంచి ఇంటికి బయలుదేరానని, మార్గం మద్యలో బస్సు కోసం ఆమె వేచి చూశానని, ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో తాను అక్కడే ఉన్నానని ఇటీవల ఆమె పోలీసులకు చెప్పింది.

నన్ను కిడ్నాప్ చేశారు
బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఐదు మంది తనను కారులో కిడ్నాప్ చేశారని, ఓ ఇంటిలోకి ఎత్తుకుని వెళ్లి తన మీద సామూహిక అత్యచారం చేశారని ఢిల్లీకి చెందిన ఆమె కేసు పెట్టింది. తనను రెండు రోజుల పాటు ఇంటిలో నిర్బందించి పదేపదే సామూహిక అత్యాచారం చేశారని ఆమె వాపోయింది.

ప్రైవేట్ పార్ట్ లో ఇనుపరాడ్
తనను రెండు రోజుల పాటు ఇంటిలో నిర్బందించి పదేపదే సామూహిక అత్యాచారం చేశారని, తరువాత ప్రైవేటు పార్ట్ లో ఇనుప రాడ్ చెక్కేసి కారులో పిలుచుకుని వెళ్లి రోడ్డు పక్కన తోసేసి వెళ్లిపోయారని మహిళ పోలీసు కేసు పెట్టింది. మహిళను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిన సమయంలో ఆమె ప్రైవేట్ పార్ట్ లో ఇనుపరాడ్ ఉండటంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు.

మహిళా కమీషన్ నోటీసులతో ?
మహిళ గ్యాంగ్ రేప్ కేసు విషయంలో గాజియాబాద్ పోలీసులకు నోటీసులు ఇచ్చామని, నిందితులను అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశామని ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మాళివాలే ట్విట్ చేశారు. మహిళ గ్యాంగ్ రేప్ కేసులో ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ఐదు మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు.

నాటకాలు ఆడిన లేడీ
అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయని ఉత్తరప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ మీడియాకు చెప్పడంతో కేసు మలుపుతిరిగింది. మహిళ మీద గ్యాంగ్ రేప్ జరగలేదని, ఆమె రెండు రోజుల పాటు ఇద్దరు స్నేహితులతో రహస్య ప్రాంతంలో ఉందని సీనియర్ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారని ఏఎన్ఐ మీడియా చెప్పింది.

భూవివాదం కేసులో పగ తీర్చుకోవాలని స్కెచ్
గ్యాంగ్ రేప్ జరిగిందని కేసు పెట్టిన మహిళకు, ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు మందికి భూవివాదం ఉందని పోలీసులు అంటున్నారు. భూవివాదం కేసులో ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవాలని ఆమె చాలా కాలం నుంచి ఎదురు చూస్తోందని, అందుకే గాజియాబాద్ వెళ్లి తన మీద గ్యాంగ్ రేప్ జరిగిందని కట్టుకథ అల్లిందని పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు.

అందరితో ఆడుకున్న కిలాడీ లేడీ
మహిళ స్నేహితులో ఆమె కాళ్లు చేతులు కట్టేసి ప్రైవేట్ పార్ట్ లో ఇనుపరాడ్ పెట్టి రోడ్డు పక్కన వదిలేశారని విచారణలో వెలుగు చూసిందని సీనియర్ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పడం కలకలం రేపింది. పోలీసులను, మహిళా కమీషన్ ను తప్పుదోవ పట్టించిన మహిళను విచారణ చేస్తున్నామని, పగ కోసం అందరితో ఈమె ఆడుకుందని సీనియర్ పోలీసు అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications