Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady leader: రేఖ హత్య మాస్టర్ మైండ్ ఎవరంటే ?, వదిన, మేనల్లుడు అరెస్టు, పెత్తనం ఎక్కువని !

బెంగళూరు: బెంగళూరుని ఛలవాదిపాళ్య మాజీ కార్పోరేటర్, బీజేపీ నాయకురాలు రేఖా అలియాస్ రేఖా కదిరేష్ హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రేఖ హత్య కేసులోని ప్రధాన నిందితులు ఐదు మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రేఖా హత్య కేసులో కొత్తకొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. రేఖాను హత్య చేసిన ఆమె బాడీగార్డు కదిరేష్ కుటుంబ సభ్యుల పేర్తు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. రేఖ హత్య కేసులో ఆమె మేనల్లుడిని అరెస్టు చేసిన పోలీసులు రేఖా వదినను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

నిమిషంలో నరికేశారు

నిమిషంలో నరికేశారు

బెంగళూరు నగరంలోని ఛలవాదిపాళ్య బీజేపీ మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ అలియాస్ రేఖా (42) ప్లవర్ గార్డెన్ లో నివాసం ఉంటున్నారు. ప్లవర్ గార్డెన్ లోని కార్యాలయంలో నుంచి అన్నదానం చెయ్యడానికి నుంచి రేఖా కదిరేష్ బయటకు వచ్చిన వెంటనే అక్కడే ఉన్న ప్రత్యర్థులు ఒక్కసారిగా కత్తులతో ఆమెను నరికేశారు. కిందపడిన రేఖా కదిరేష్ గొంతుకోసేసి అనుకున్న పనిముగించుకున్న నిందితులు అక్కడి నుంచి పరారైనారు.

ఉలిక్కిపడిన ఐటీ హబ్

ఉలిక్కిపడిన ఐటీ హబ్

రేఖా కదిరేష్ గొంతు తెగిపోవడంతో ఆమె కేకలు వెయ్యలేకపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రేఖాను కెంపేగౌడ ఆసుపత్రికి తరలించారు. గొంతు పూర్తిగా తెగిపోవడం, శరీరం మీద కత్తిపోట్లు ఎక్కువ పడడటంతో చికిత్స విఫలమై రేఖా ప్రాణాలు పోయాయి. బెంగళూరులో మాజీ కార్పోరేటర్, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకురాలు రేఖా కదిరేష్ హత్యకు గురి కావడం ఐటీ హబ్ లో కలకలం రేపింది.

ఫ్యాక్షన్ సినిమా స్కెచ్

ఫ్యాక్షన్ సినిమా స్కెచ్

రేఖా కదిరేష్ కార్యాలయానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రేఖా కార్యాలయానికి ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పైకి, పక్కకు తిప్పేశారని బెంగళూరు సిటీ అడిషనల్ పోలీసు కమీషనర్ మురుగన్ ఆరోజే మీడియాకు చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే మాజీ కార్పోరేటర్ రేఖా కదిరేష్ ను హత్య చేశారని పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు.

 సీఎం ఎంట్రీతో సీన్ మారిపోయింది

సీఎం ఎంట్రీతో సీన్ మారిపోయింది

బీబీఎంపీ మాజీ కార్పోరేటర్, బీజేపీ నాయకురాలు రేఖాను పట్టపగలు, నడిరోడ్డు మీద దారుణంగా నరికి చంపేసిన విషయం తెలుసున్న కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సీరియస్ అయ్యారు. హంతలను 24 గంటల్లో అరెస్టు చేసి వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం బీఎస్ యడియూరప్ప బెంగళూరు సిటీ పోలీసు అధికారుకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు రేఖాను హత్య చేసిన నిందితులు ఎలాగైనా తప్పించుకోవాలని చేసని ప్రయత్నాలు మొత్తం రివర్స్ అయ్యాయి.

రేఖా ప్రాణం తీసిన బాడీగార్డు

రేఖా ప్రాణం తీసిన బాడీగార్డు


సుమనహళ్ళి సమీపంలోని శ్రీ శనిమహాత్మస్వామి దేవాలయం సమీపంలో రేఖా హత్య కేసులో నిందితులు రేఖ బాడీగార్డు పీటర్, సూర్యా పారిపోవడానికి ప్రయత్నించారు. కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ శివస్వామి నిందితులను లొంగిపోవాలని చెప్పారు. పోలీసుల మీద కత్తులతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన పీటర్, సూర్య మీద ఇన్స్ పెక్టర్ శివస్వామి కాల్పులు జరిపి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో పీటర్, సూర్య, స్టీఫెన్ రేఖా హత్య వెనుక ఆమె కుటుం సభ్యులు ఉన్నారని చెప్పడం కలకలం రేపింది.

ఫ్యామిలీ గొడవలు

ఫ్యామిలీ గొడవలు

మాజీ కార్పోరేటర్ కదిరేష్ తమిళ సోదరుడు. బెంగళూరులోని ప్లవర్ గార్డెన్ లో కదిరేష్ సెటిల్ అయ్యాడు. కదిరేష్ అక్క మాలా తమిళనాడులో ఉండేది. బెంగళూరులో కదిరేష్, అతని సోదరి మాలా కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారని అప్పట్లో ఇద్దరిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పుడే రౌడీషీటర్ జాబితాలోకి కదిరేష్ పేరు చేరిపోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన కదిరేష్ రాజకీయాల్లోకి వచ్చాడు. మాలా కూడా జైలు నుంచి బయటకు వచ్చి ప్లవర్ గార్డెన్ లో ఉండిపోయింది.

 రెండో భార్యకు పెత్తనం

రెండో భార్యకు పెత్తనం

కదిరేష్ రేఖాను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కంటే రేఖాతోనే ఎక్కువగా కాలం గడిపిన కదిరేష్ ఆమెను కార్పోరేటర్ ను చేశాడు. రేఖా పేరుకు మాత్రమే కార్పోరేటర్ గా ఉన్నా అన్ని పనులు మాత్రం కదిరేష్ చేసేవాడు. కదిరేష్ అతని అక్క మాలా కుటుంబానికి ఆర్థికంగా పూర్తి సహకారం ఇచ్చాడు. 2018లో కదిరేష్ హత్యకు గురైన తరువాత రేఖా సీన్ లోకి వచ్చి ఆ ఏరియాలో కదిరేష్ వర్గంలో పెత్తనం మొత్తం ఆమె చేతుల్లోకి తీసుకుంది. కదిరేష్ కుటుంబ సభ్యులు ఎవ్వరికి రేఖా ఆర్థిక సహాయం చెయ్యకపోవడంతో అక్కడ కథ రివర్స్ అయ్యింది.

 వదిన VS మాజీ కార్పోరేటర్

వదిన VS మాజీ కార్పోరేటర్

కదిరేష్ హత్యకు గురైన తరువాత భర్త కుటుంబ సభ్యులు అందర్ని రేఖా దూరం పెట్టడంతో ఆ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. కదిరేష్ ఆస్తిని మొత్తం రేఖా అనుభవిస్తోందని, మాకు ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదని మాలా కుటుంబ సభ్యులు రగిలిపోయారు. ఇటీవల కాలంలో రేఖా, ఆమె ఆడపడుచు మాలాకు మద్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో కదిరేష్ బందువును అందరి ముందు రేఖా చితకబాదడంతో మాలా ఆమె మీద రగిలిపోయిందని పోలీసు అధికారులు అంటున్నారు.

ఆస్తి కోసం ఆడపడుచు స్కెచ్ ?

ఆస్తి కోసం ఆడపడుచు స్కెచ్ ?


కదిరేష్ హత్యకు గురైన తరువాత రేఖా మీద మాలా, ఆమె కొడుకు అరుల్, అరుల్ భార్య, స్థానికంగా నివాసం ఉంటున్న డిపౌజా, రాజేష్ లను పోలీసులు అరెస్టు చేశారు. రేఖాను హత్య చేసిన పీటర్, స్టీఫెన్, సూర్యాకు కదిరేష్ అక్క మాలా, ఆమె కొడుకు అరుల్, అతని భార్య పూర్తిగా సహకరించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రేఖా హత్య కేసులో ఇంకా కొంత మంది అరెస్టు అయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+