Lady: ఇంట్లో లేడీ హోమ్ గార్డు శవం, పక్కనే నాలుగు రోజులు కుర్చున్న తల్లి, భర్తకు ముందే విడాకులు !

బెంగళూరు/ మండ్య: హోమ్ గార్డుగా ఉద్యోగం చేస్తున్న మహిళ ఆమె తల్లితో కలిసి నివాసం ఉంటున్నది. నాలుగు రోజుల క్రితం కూతురు బయట నుంచి ఇంటికి వెళ్లింది. తరువాత తల్లీ కూతురు ఇంటి నుంచి బయటకు రాలేదు. లేడీ హోమ్ గార్డు ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. లేడీ హోమ్ గార్డు కుళ్లిపోయిన శవమై కనిపించడం, ఆమె శవం పక్కనే తల్లీ కుర్చుని ఉండటంతో స్థానికులు హడలిపోయారు.

కర్ణాటకలోని మండ్యలోని న్యూ తమిళ్ కాలనీలో రూపా (30) అనే మహిళ నివాసం ఉంటున్నది. హోమ్ గార్డుగా ఉద్యోగం చేస్తున్న రూపా ఆమె తల్లి నాగమ్మతో కలిసి న్యూ తమిళ్ కాలనీలో నివాసం ఉంటున్నది. కొన్ని కారణాల వలనే కొన్ని నెలల క్రితం రూపాను అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తరువాత రూపా ఇంటికే పరిమితం అయ్యింది.

 Lady: Mother spent 4 days with daughter deadbody in Mandya in Karnataka.

10 రోజుల క్రితం ఉద్యోగానికి రావాలని అధికారులు రూపాకు లేఖ పంపించారు. అప్పటి నుంచి రూపా ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. నాలుగు రోజుల క్రితం రూపా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే రోజు రాత్రి రూపా ఇంటికి వెళ్లింది. తరువాత రూపా, ఆమె తల్లి నాగమ్మ ఇంటి నుంచి బయటకురాలేదు. న్యూ తమిళ్ కాలనీలో రూపా నివాసం ఉంటున్న ప్రాంతంలో దుర్వాసన వచ్చింది. ఎక్కడో కుక్క కాని, పందికుక్క కాని చనిపోయి ఉంటుందని, అందుకే దుర్వాసన వస్తోందని అనుమానంతో మొదట స్థానికులు పరిశీలించారు.

అయితే రూపా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చింది, పిలిచినా రూపా, ఆమె తల్లి నాగమ్మ మాట్లాడలేదని వాళ్ల ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. రూపా చనిపోవడం, ఆమె శరీరం కుళ్లిపోవడంతో దుర్వాసన వస్తోందని వెలుగు చూసింది. రూపా శవం పక్కనే ఆమె తల్లి నాగమ్మ కుర్చుని ఉండటంతో స్థానికులు హడలిపోయారు. నాలుగు రోజుల క్రితమే రూపా చనిపోయిందని పోలీసులు అంటున్నారు.

10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న రూపా కుటుంబ గొడవల కారణంగా ఐదు సంవత్సరాల క్రితం భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఆమె తల్లి నాగమ్మతో కలిసి నివాసం ఉంటున్నదని పోలీసులు అంటున్నారు. అయితే రూపా ఎలా చనిపోయింది అని తెలియడం లేదని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+