Lady: మహిళను నగ్నంగా కుర్చోబెట్టి అర్దరాత్రి... ఓం భ్రీమ్ ఢ్రూమ్, పక్కన నగ్నంగా ?, వ్యాపారి ఇంట్లో హడల్ !
బెంగళూరు/రామనగర: వివాహం చేసుకుని భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. ఏ వ్యాపారం చేసినా నష్టాలు రావడంతో అతను విసిగిపోయాడు. రూ. లక్షలు లక్షలు డబ్బులు ఖర్చు అయిపోతున్నా వ్యాపారంలో మాత్రం లాభాలు రాకపోవడంతో అతను విసిగిపోయాడు. పెట్టేపేడా సర్దుకుని ఇళ్లు ఖాళీ చేసి భార్య ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నాడు. తాను వ్యాపారంలో నష్టపోతున్నానని అతను కొందరి దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఓమాత్రికుడిని పరిచయం చేశారు. నీ ఇంట్లో నిధి ఉందని, దానివలనే నువ్వు చేస్తున్న వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయని, ఆ నిధికి శాంతిపూజలు చేసి నరబలి ఇస్తే నువ్వు పట్టిందాల్లా బంగారం అవుతుందని చెప్పారు. మహిళ చేతిలో రూ. 50 వేలు పెట్టి ఆమెను అతని ఇంటిలో నగ్నంగా కుర్చోబెట్టారు. ఇంటి యజమాని కూడా నగ్నంగా తయారై పూజలో కుర్చున్నాడు. అర్దరాత్రి ఇంట్లో పెద్ద గుంత తీసి పూజాలు చేస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అర్దరాత్రి పూజలు చేస్తున్న ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు బిత్తరపోయారు.

ఐటీ హబ్ బెంగళూరు సిటి
ఐటీ హబ్ బెంగళూరుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఐటీ బీటీ రంగాలకు ప్రసిద్ది చెందిన బెంగళూరులో దేశ విదేశాలకు చెందిన లక్షలాది మంది విద్యావంతులు నివాసం ఉంటున్నారు. టెక్నాలజీ పరంగా దక్షిణ భారతదేశంలోనే బెంగళూరు సిటీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బెంగళూరు శివార్లలో కాపురం
బెంగళూరు సిటీకి సమీపంలోని కనకపుర తాలుకా సాతనూరు సమీపంలోని భఊహళ్ళిలో శ్రీనివాస్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. వివాహం చేసుకుని భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న శ్రీనివాస్ వ్యాపారం చేస్తున్నాడు. ఏ వ్యాపారం చేసినా నష్టాలు రావడంతో శ్రీనివాస్ విసిగిపోయాడు. ఏవ్యాపారం చేసినా శ్రీనివాస్ నష్టాలను చవిచూశాడు.

ఇంటినే మార్చేసిన వ్యాపారి
రూ. లక్షలు లక్షలు డబ్బులు ఖర్చు అయిపోతున్నా వ్యాపారంలో మాత్రం లాభాలు రాకపోవడంతో శ్రీనివాస్ హడలిపోయాడు. పెట్టేపేడా సర్దుకుని భూహళ్ళిలోని సొంత ఇళ్లు ఖాళీ చేసి శ్రీనివాస్ అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం పెళ్లికి వెళ్లిన శ్రీనివాస్ అక్కడ పెళ్లిలో కలిసిన నాగరాజు, పార్థసారధి అనే ఇద్దరితో మాట్లాడుతూ దగ్గర తాను వ్యాపారంలో నష్టపోతున్నానని శ్రినివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడు పొటుగాడు
నీ కష్టాలు తీరిపోవాలంటే తమిళనాడులో ఉంటున్న శివకుమార్ అనే మాత్రగాడిని కలవాలని, అతను నీ కష్టాలు తీర్చడానికి పూజలు చేస్తాడని నాగరాజు, పార్థసారధి వ్యాపారి శ్రీనివాస్ కు చెప్పారు. అంతే పార్థసారధి, నాగరాజును వెంట పెట్టుకున్న శ్రీనివాస్ పోలో అంటూ తమిళనాడు వెళ్లి హైటెక్ మంత్రగాడు శివకుమార్ స్వామిజీని కలిశారు.

మీ ఇంట్లో నిధి ఉంది... శాంతి పూజలు చేసి నరబలి ఇవ్వాలి
నీ ఇంట్లో నిధి ఉందని, దానివలనే నువ్వు చేస్తున్న వ్యాపారాలు నష్టాల్లో ఉన్నాయని, ఆ నిధికి శాంతిపూజలు చేసి నరబలి ఇస్తే నువ్వు పట్టిందాల్లా బంగారం అవుతుందని మంత్రగాడు శివకుమార్ లబోదిబో అంటున్న వ్యాపారి శ్రీనివాస్ కు చెప్పారు. ఇంట్లో పూజలు చేసి నరబలి ఇస్తే తాను కోటీశ్వరుడు అయిపోతానని శ్రీనివాస్ పగటికలలు కన్నాడు.

మహిళకు రూ. 50 వేలు ఇచ్చి ఒప్పించాడు
ఆరు నెలల నుంచి శ్రీనివాస్ ఇంటిలో అప్పుడప్పుడు అర్దరాత్రి పూట తమిళనాడుకు చెందిన శివకుమార్ క్షుద్రపూజలు చేస్తూ వస్తున్నాడు. కూలి పనులు చేస్తున్న సుజాత అనే మహిళతో మాట్లాడిన శ్రీనివాస్ మా ఇంట్లో జరిగే పూజల్లో నీవు నగ్నంగా కుర్చుంటే నీకు రూ. 50 వేలు ఇస్తానని చెప్పాడు. ఒక్కరోజు పూజలో నగ్నంగా కుర్చుంటే రూ. 50 వేలు వస్తుందని ఆశతో సుజాత ఓకే చెప్పింది.

ఓం... భ్రీమ్.... డ్రూమ్ అంటూ క్షుద్రపూజలు
సుజాత చేతిలో రూ. 50 వేలు పెట్టి ఆమెను శ్రీనివాస్ ఇంటిలో అర్దరాత్రి నగ్నంగా కుర్చోబెట్టారు. ఇంటి యజమాని శ్రీనివాస్ కూడా నగ్నంగా తయారై పూజలో కుర్చున్నాడు. అర్దరాత్రి పూజల శ్రీనివాస్ ఇంటి నుంచి ఓం భ్రీమ్ డ్రూమ్ అంటూ పూజలు చేశారు. శ్రీనివాస్ ఇంటి లోపల పెద్ద గుంత తీశారు. అర్దరాత్రి శ్రీనివాస్ ఇంట్లో పూజాలు చేస్తున్న విషయం గుర్తించిన స్థానికులు హడలిపోయి సాతనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బిత్తరపోయిన పోలీసులు
పోలీసులు అర్దరాత్రి శ్రీనివాస్ ఇంటి తలుపులు తీసి చూసి బిత్తరపోయారు. మహిళ, ఆమె పక్కనే మరో వ్యక్తి నగ్నంగా కుర్చుని నగ్న పూజలు చేస్తున్న విషయం గుర్తించిన స్థానికులు హడలిపోయారు. నగ్నపూజలో కుర్చున్న మహిళను రక్షించి ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పూజ మధ్యలో ఆగిపోయిందని ఇంటి యజమాని శ్రీనివాస్ షాక్ అయ్యాడు.

మదనపల్లెలో దొంగ స్వామి కారణంగా ఇద్దరు అమ్మాయిలు బలి
నిధి ఆశ కోసం నిషేధిత క్షుద్రపూజలు చేస్తున్న తమిళనాడుకు చెందిన మంత్రగాడు శివకుమార్ స్వామిజీ అలియాస్ శివకుమార్, పార్థసారధి, నాగరాజు, మోహన్, లోకేష్, లక్ష్మీనరసప్ప అనే వ్యక్తులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని సాతనూరు పోలీసు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా ఇంటి క్షుద్రపూజలు చేసే దొంగస్వాముల మాటలు విని కన్న కూతుర్లు ఇద్దరిని తల్లిదండ్రులు దారుణంగా నరబలి ఇచ్చిన విషయం తెలిసిందే.
-
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications