Lady: హైదరాబాద్ టూ ముంబాయి, కదులుతున్న రైల్లో లేడీని పట్టుకుని ఎన్ సీబీ ఎస్పీ ఏం చేశాడంటే !

హైదరాబాద్/ ముంబాయి: డ్రగ్స్ కేసుల్లో బాలీవుడ్ స్టార్ నటీనటులు, వారి కొడుకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారులు ఇప్పుడు నిత్యం హాట్ టాపిక్ అయ్యారు. ఇదే సమయంలో ఓ ఎన్ సీబీ అధికారి మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి ముంబాయికి రైలులో ప్రయాణికులు వారి గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రయాణిస్తున్నారు.ఇదే రైలులో ప్రయాణిస్తున్న ఎన్ సీబీ ఎస్పీ సాటి ప్రయాణికురాలి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వెలుగు చూసింది. బెర్త్ లో నిద్రపోతున్న మహిళను ఎన్ సీబీ ఎస్పీ లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. అయితే ఎన్ సీబీ అధికారి మానసిక పరిస్థితి బాగాలేదని సాటి అధికారులు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

ఎన్ సీబీ అధికారుల పేరు హాట్ టాపిక్

ఎన్ సీబీ అధికారుల పేరు హాట్ టాపిక్

గత కొంతకాలంగా డ్రగ్స్ కేసుల్లో బాలీవుడ్ స్టార్ నటీనటులు, వారి కొడుకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారులు ఇప్పుడు నిత్యం హాట్ టాపిక్ అయ్యారు. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసు విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లో ఉన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ టూ ముంబాయి

హైదరాబాద్ టూ ముంబాయి


హైదరాబాద్ నుంచి ముంబాయికి రైలు బయలుదేరింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన రైలులో ప్రయాణికులు వారి గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రయాణిస్తున్నారు.ఇదే రైలులో 35 ఏళ్ల వయసు ఉన్న ఎస్పీ స్థాయి ఎన్ సీబీ అధికారి ప్రయాణించారు. ఎన్ సీబీ అధికారి ప్రయాణిస్తున్న బోగిలో ఓ మహిళ ముంబాయి బయలుదేరింది.

 అత్యాచారయత్నం చేసిన ఎస్పీ ?

అత్యాచారయత్నం చేసిన ఎస్పీ ?

రైలులో ప్రయాణికులు చాలా మంది నిద్రలోకి జారుకున్నారని తెలిసింది. ఆసమయంలో అదే రైలులో ప్రయాణిస్తున్న ఎన్ సీబీ ఎస్పీ సాటి ప్రయాణికురాలి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వెలుగు చూసింది. బెర్త్ లో నిద్రపోతున్న మహిళను ఎన్ సీబీ ఎస్పీ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

 ఔరంగాబాద్ లో ఎస్పీ అరెస్టు

ఔరంగాబాద్ లో ఎస్పీ అరెస్టు


ఎన్ సీబీ అధికారి లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన సాటి ప్రయాణికులు మహిళను రక్షించి వెంటనే ఎన్ సీబీ అధికారిని పట్టుకున్నారు. సాటి ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైలు ఔరంగాబాద్ చేరుకున్న వెంటనే ఎన్ సీబీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

 మానసిక పరిస్థితి బాగాలేదంటున్న అధికారులు

మానసిక పరిస్థితి బాగాలేదంటున్న అధికారులు

ఎన్ సీబీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్టు చేసిన తరువాత బాధితురాలు అదే రైలులో ఆమె ప్రయాణించిందని అధికారులు అంటున్నారు. గత ఎనిమిది నెలల నుంచి ఆ ఎన్ సీబీ అధికారి మనోరోగిగా చికిత్స పొందుతున్నాడని, ఆయన మానసిక పరిస్థితి సక్రమంగా లేదని ఎన్ సీబీ అధికారులు అంటున్నారు. ఎన్ సీబీ అధికారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను వాలంటరి రిటైడ్ మెంట్ తో ఉద్యోగం నుంచి తప్పించే ప్రక్రియ కొనసాగుతోందని ఓ సీనియర్ ఎన్ సీబీ అధికారి చెప్పారని, ఆ ఎన్ సీబీ అధికారి మీద లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యిందని ప్రముఖ ఆగ్ల పత్రిక కథనం వెలువరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+