Lady: రివాల్వర్ తో బెదిరించి రెండేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్న పోలీసు, గతంలో యువతిని కిడ్నాప్ చేసి !
లక్నో: యువతి యువకుడికి ముందే పరిచయం ఉంది. యువతితో అప్పుడప్పుడు మాట్లాడుతున్న యువకుడు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. బాధితురాలు కేసు పెట్టడంతో పోలీసులు రేప్ కేసులో ఆ యువకుడిని అరెస్టు చేశారు. కేసు విచారణ చేసే నెపంతో ఓ కానిస్టేబుల్ ఆమెతో టచ్ లో ఉన్నాడు. యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ ఆమె నుంచి వివరాలు సేకరించే నెపంతో మాట్లాడటం మొదలు పెట్టాడు. తరువాత రివాల్వర్ తో బెదిరించిన కానిస్టేబుల్ ఆమె మీద అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని అప్పటి నుంచి బెదిరించి తన మీద పదేపదే అత్యాచారం చేస్తున్నాడని రేప్ కేసు బాధితురాలు కేసు విచారణ చేస్తున్న కానిస్టేబుల్ మీద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

యువతిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన బాయ్ ఫ్రెండ్
ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీపంలో 28 ఏళ్ల రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. రష్మీకి రాకేష్ ( పేరు మార్చడం జరిగింది) అనే యువకుడికి ముందే పరిచయం ఉంది. రష్మీతో అప్పుడప్పుడు మాట్లాడుతున్న రాకేష్ 2019లో ఆమెను నమ్మించి పిలుచుకుని వెళ్లి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

యువతి లైఫ్ లో పోలీసు ఎంట్రీ
బాధితురాలు రష్మీ కేసు పెట్టడంతో అప్పట్లో స్థానిక పోలీసులు రేప్ కేసులో రాకేష్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కేసు విచారణ చేసే నెపంతో 31 ఏళ్ల వయసు ఉన్న కానిస్టేబుల్ సూరజ్ (పేరు మార్చడం జరిగింది) రష్మీతో టచ్ లో ఉన్నాడు. కేసు వివరాలు తెలుసుకోవాలని రష్మీ ఫోన్ నెంబర్ తీసుకున్న కానిస్టేబుల్ సూరజ్ ఆమెకు అప్పుడప్పుడు ఫోన్లు చెయ్యడం మొదలుపెట్టాడు.

రివాల్వర్ తో బెదిరించి రేప్ చేసిన పోలీసు ?
రష్మీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ సూరజ్ ఆమె నుంచి వివరాలు సేకరించే నెపంతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తనను రివాల్వర్ తో బెదిరించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపిస్తున్నది. ఆ రోజు పూర్తిగా మా ఇంట్లో ఉన్న కానిస్టేబుల్ సూరజ్ తన మీద అనేకసార్లు అత్యాచారం చేశాడని రష్మీ ఆరోపిస్తున్నది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు
తన మీద రేప్ చేసిన విషయం బయటకు చెబితే చంపేస్తానని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని రష్మీ పోలీసులకు చెప్పింది. కొంతకాలం తరువాత సూరజ్ కు ఇప్పటికే వివాహం అయ్యిందని, ఐదు సంవత్సరాల పాప ఉందని తనకు తెలిసిందని రష్మీ పోలీసులకు చెప్పింది. ఈ విషయం ఇంతటితో వదిలేయాలని, లేదంటే చంపేస్తానని కానిస్టేబుల్ సూరజ్ తనను బెదిరిస్తున్నాడని అతని మీద రష్మీ కేసు పెట్టింది. కానిస్టేబుల్ మీద అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. రేప్ కేసులో ఇప్పటికే కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలు సేకరిస్తున్నామని ఓ సీనియర్ పోలీసు చెప్పారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications