Lady: విదేశాల్లో భర్తకు ఉద్యోగం, భార్య స్నానం చేస్తుంటే ఇంటి ఓనర్ వీడియోలు తీసి ఏం చేశాడంటే, క్లైమాక్స్ !
చెన్నై/మదురై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పెళ్లి చేసుకున్న కొంతకాలానికి భర్తకు విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. గ్రామంలో భార్య ఉండలేదని అనుకున్న భర్త పట్టణంలో ఓ ఇంటిని లీజుకు తీసుకున్నాడు. లీజుకు తీసుకున్న ఇంటిలో భార్యను పెట్టిన అతను విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. లీజు అగ్రిమెంట్ చేసివ్వకుండా ఇంటి యజమాని ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. తరువాత అవసరం అయ్యి ఆమె ఇంటి యజమాని దగ్గర కొంత డబ్బులు తీసుకుంది. ఇదే అదనుగా భావించిన ఇంటి యజమాని ఆమె ఇంటికి వెళ్లి వస్తున్నాడు. మహిళ నివాసం ఉంటున్న ఇంటి బాత్ రూమ్ లో సీక్రేట్ గా మొబైల్ ఫోన్ ఆన్ చేసి పెట్టిన ఇంటి యజమాని ఆమె స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీశాడు. నేనే చెప్పినట్లు నువ్వు వినకుంటే విదేశాల్లో ఉన్న నీ భర్తకు నీ నగ్న వీడియో పంపిస్తానని ఆమెతో ఆడుకున్నాడు. మహిళను బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర విపరీతంగా అప్పుులు చేయించాడు. ఆమె దగ్గర ఉన్న రూ. 20 క్షల విలువైన బంగారు నగలు లాక్కొని వెళ్లి వాటిని కుదవపెట్టి ఆమె జీవితంతో చెలగాటం ఆడాడు. విదేశాల్లో ఉన్న భర్తకు మ్యాటర్ తెలిసిపోవడంతో కథ రసవత్తరంగా మారిపోయింది.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమకుడిలో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాజేష్ రూపా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాజేష్ , రూపా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

భర్తకు విదేశాల్లో ఉద్యోగం
పెళ్లి చేసుకున్న కొంతకాలానికి రాజేష్ కు విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. గ్రామంలో భార్య రూపా ఒంటరిగా ఉండలేదని అనుకున్న రాజేష్ పరమకుడి పట్టణంలో ఓ ఇంటిని లీజుకు తీసుకున్నాడు. లీజుకు తీసుకున్న ఇంటిలో భార్య రూపాను పెట్టిన రాజేష్ విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. లీజు అగ్రిమెంట్ చేసివ్వకుండా ఇంటి యజమాని సెల్వరాజ్ (పేరు మార్చడం జరిగింది) రూపాను ఇబ్బందులకు గురి చేశాడు.

రూ. 50 వేల కోసం ఇంటికి వెళ్లి ?
కొంతకాలం తరువాత డబ్బు అవసరం కావడంతో రూపా ఆమె ఇంటి యజమాని సెల్వరాజ్ దగ్గర రూ. 50 వేలు డబ్బులు తీసుకుంది. రూ. 50 వేలు డబ్బులు ఇచ్చిన సెల్వరాజ్ ఎప్పుడంటే అప్పుడు రూపా ఇంటికి వెళ్లి ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. భర్త రాజేష్ విదేశాల్లో ఉండటంతో రూపాను శారీరకంగా హింసించిన సెల్వరాజ్ ఆమె మీద ఉన్న కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించాడు.

బాత్ రూమ్ లో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
రూపా నివాసం ఉంటున్న ఇంటి బాత్ రూమ్ లో సీక్రేట్ గా మొబైల్ ఫోన్ ఆన్ చేసి పెట్టిన ఇంటి యజమాని సెల్వరాజ్ ఆమె స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీశాడు. నేనే చెప్పినట్లు నువ్వు వినకుంటే విదేశాల్లో ఉన్న నీ భర్త రాజేష్ కు నీ నగ్న వీడియో పంపిస్తానని రూపాను బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు.

టార్చర్ ఎక్కువ కావడంతో ?
రూపాతో కొంతకాలం నుంచి సెల్వరాజ్ ఆడుకున్నాడు. రూపాను బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గర రూ. 10 రూపాయల వడ్డీతో విపరీతంగా అప్పులు చేయించి ఆడబ్బు లాక్కొన్న సెల్వరాజ్ ఆమెకు నరకం చూపించాడు. రూపా దగ్గర ఉన్న రూ. 20 క్షల విలువైన బంగారు నగలు లాక్కొని వెళ్లిన సెల్వరాజ్ ఆ నగలు కుదవపెట్టి ఆడబ్బుతో జల్సా చేశాడు.

క్లైమాక్స్ లో సీన్ రివర్స్
ఇంటి యజమాని ఒంటరిగా ఉంటున్న రూపా జీవితంతో చెలగాటం ఆడాడు. టార్చర్ తట్టుకోలేక రూపా విదేశాల్లో ఉన్న భర్త రాజేష్ కు మ్యాటర్ చెప్పింది. రాజేష్ బంధువు సహాయంతో రూపా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సెల్వరాజ్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీసి విచారణ చేస్తున్నారు.