లేడీ టెక్కీ రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

బళ్ళారి: బళ్ళారి సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఐటీ ఉద్యోగిని తీవ్ర గాయాలతో రైలు పట్టాలపై అనుమానాస్పదంగా పడి ఉంది.అయితే యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిందా,లేక ఎవరైనా హత్య ప్రయత్నం చేశారా అనే విషయమై చర్చ సాగుతోంది.

సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే యువతి రైలు పట్టాలపై తీవ్ర గాయాలతో పడి ఉండగా రైల్వే పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన బళ్ళారి నగరంలోని రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ బ్రిడ్జి పక్కన బుదవారంనాడు చోటుచేసుకొంది.

lady techie seriour injuried in bellary

బళ్ళారిలోని పార్వతీ నగర్ కు చెందిన స్వాతి బీకాం పూర్తి చేసి పూణెలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది.ఆమె తండ్రి మృతి చెందాడు.తల్లి బళ్ళారిలో పెద్ద కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది.

స్వాతి ఉగాది పండుగకోసం బళ్ళారి వచ్చింది. బుదవారం ఉదయం పదకొండు గంటలకు ఇంటి నుండి వెళ్ళిన స్వాతి రైలు పట్టాలపై గాయాలతో కన్పించింది. ఘటనపై బళ్ళారి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి ఆత్మహత్యకు యత్నించిందా లేదా ప్రమాదవశాత్తు రైలు కింద పడి గాయపడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
lady techie seriour injuried in bellary on wednesday. she was severely injured on railway track at moti bridge.
Please Wait while comments are loading...