Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమంత్రి నిర్బంధం: మాజీ ముఖ్యమంత్రి హౌస్ అరెస్ట్: కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారు కింద పడి నలుగురు రైతులు దుర్మరణం పాలు కావడం, ఆ తరువాత చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మరో నలుగురు మృతి చెందడంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. లఖింపూర్ ఖేరిలో పలుచోట్ల 144 సెక్షన్‌ను విధించినట్లు తెలుస్తోంది. కొత్త వారు ఎవరూ నగరంలోనికి రాకుండా ఉండేలా పోలీసులు సరిహద్దులను మూసివేశారు.

కాన్వాయ్‌కు అడ్డుగా..

కాన్వాయ్‌కు అడ్డుగా..


లఖింపూర్ ఖేరి పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తోన్న కారును అడ్డుకుని, తమ నిరసన తెలియజేయడానికి రైతులు ప్రయత్నించారు. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఏడాదికాలంగా రైతులు చేస్తోన్న నిరసన దీక్షలకు కొనసాగింపుగా భారత్ కిసాన్ యూనియన్ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రమంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకుని, మూడు వ్యవసాయ చట్టాల పట్ల తమకు నిరసనలను తెలియజేయాలనేది వారి ఉద్దేశం.

అడ్డుకున్న రైతులు..

అడ్డుకున్న రైతులు..

లఖింపూర్ ఖేరి.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా సొంత లోక్‌సభ నియోజకవర్గం. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచే గెలుపొందారు. తన నియోజకవర్గంలో పర్యటించడానికి వచ్చిన ఆయనను రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న కారుకు అడ్డుగా కూర్చున్నారు. అయినప్పటికీ- లెక్క చేయలేదని, కారును రైతుల మీదుగా పోనిచ్చారనే ఆరోపణలు అజయ్ మిశ్రాపై ఉన్నాయి. ధర్నా చేస్తోన్న రైతులపై కారును పోనివ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఉద్రిక్త పరిస్థితులు..

ఉద్రిక్త పరిస్థితులు..

ఈ ఘటన తరువాత లఖింపూర్ ఖేరి ఒక్కసారిగా భగ్గుమంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు దాడులకు దిగారు. వాహనాలను ధ్వంసం చేశారు. కారుకు నిప్పు పెట్టారు. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరింపజేసింది. ప్రత్యేక టీమ్‌లను రప్పించింది. ఈ ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.

కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్

కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్


ఈ ఘటనకు కారణమైనట్లుగా భావిస్తోన్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతుల సంఘాల ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై లఖింపూర్ పోలీసులు కేసు పెట్టారు. అజయ్ మిశ్రాతో పాటు ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రాపై టికూనియా పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. వారితో పాటు మొత్తం 14 మందిని ఇందులో చేర్చారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉంటూ నిర్దాక్షిణ్యంగా రైతులపై కారును నడిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి హౌస్ అరెస్ట్..


ఈ ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లనున్నట్లు ప్రకటించిన ప్రతిపక్ష నాయకులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ ఉదయం లఖింపూర్ వెళ్లడానికి సన్నద్ధమైన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

వీధులు బ్లాక్..

రాజధాని లక్నోలోని గులిస్తాన్ కాలనీ, విక్రమాదిత్య మార్గ్‌లో అఖిలేష్ యాదవ్ నివాసం ఉంటోన్నారు. ఆయన నివాసానికి దారి తీసే మార్గాలన్నింటినీ పోలీసులు మూసివేశారు. బ్లాక్ చేశారు. వాహనాలను అడ్డుగా పెట్టారు. భారీ వాహనాలను సైతం ఎక్కడిక్కడ అడ్డుగా పెట్టారు. కొత్త వారెవరూ ఆయన నివాసానికి చేరుకోకుండా.. బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు అందేంత వరకూ అఖిలేష్ యాదవ్ గృహ నిర్బంధంలో కొనసాగుతారని లక్నో పోలీసులు స్పష్టం చేశారు.

ఎయిర్ పోర్ట్‌లో ముఖ్యమంత్రి నిర్బంధించడానికి ఉత్తర్వులు..

ఎయిర్ పోర్ట్‌లో ముఖ్యమంత్రి నిర్బంధించడానికి ఉత్తర్వులు..

లఖింపూర్ వెళ్లడానికి లక్నోకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్జీిందర్ సింగ్ రంధవాను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకోవాలంటూ ఉత్తర ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీష్ అవస్థి ఉత్తర్వులను జారీ చేశారు. లక్నోలోని చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దాటి బయటికి రానివ్వొద్దంటూ పోలీసులకు సూచించారు. లఖింపూర్ ఖేరిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తోన్నందున.. బయటి వ్యక్తులను ఎవ్వరినీ అక్కడికి వెళ్లనివ్వొద్దంటూ ఇప్పటికే జిల్లా అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు.

Recommended Video

    పెరిగిన నిత్యవసర సరుకులపై కార్యాచరణ ప్రకటించిన టీపిసిసి మహిళా నేత సునిత రావు

    ప్రియాంక గాంధీ అరెస్ట్..

    ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హర్గావ్ వద్ద ఆమెను మళ్లీ అడ్డుకున్నారు. అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారు జామున 5:30 గంటలకు ప్రియాంక గాంధీ వాద్రాను అరెస్ట్ చేశారని, ఆమెను వేర్వేరు వాహనాల్లో తిప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. హర్గావ్ నుంచి సీతాపూర్ జిల్లాకు తరలించారని పేర్కొన్నారు. లఖింపూర్ ఘటనలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించడానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వం ఎంతగా అడ్డుకున్నా.. తాము లఖింపూర్ చేరుకుంటామని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+