లఖీపూర్ ఖేరీ హింసకు సూత్రదారి ఆశీష్ మిశ్రానే.. 5వేల పేజీలతో సీట్ చార్జిషీట్..

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి హింసాకాండ సూత్రదారి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా అని సీట్ తేల్చిచెప్పింది. ఈ ఘటన నిర్లక్ష్యం వల్ల జరింది కాదని, కేవలం చంపాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది. హింసాకాండపై విచారణ వేగవంతం చేసిన సిట్ ఛార్జీషీటు నమోదు చేసింది. ఈ మేరకు 5 వేల పేజీలతో కూడిన ప్రతాలను లఖీంపూర్ ఖేరీ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌కు సీట్ అధికారులు సమర్పించారు

ప్ర‌ధాన కుట్ర‌దారుడు ఆశిష్ మిశ్రానే ..

ప్ర‌ధాన కుట్ర‌దారుడు ఆశిష్ మిశ్రానే ..


కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా గత అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అదే సమయంలో రైతులపై వాహనం నడపడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఈ హింసాకాండంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ జరిపిన సీట్ ఛార్జీషీటు నమోదు చేసింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రానే ప్రధాన కుట్రదారుగా సిట్ నిర్దారించింది . మొత్తం 5 వేల పేజీలతో కూడిన ప్రతాలను లఖీంపూర్ ఖేరీ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కు సీట్ అధికారులు సమర్పించారు.

 పక్కా ప్రణాళికతోనే..

పక్కా ప్రణాళికతోనే..


తికునియా గ్రామంలో ఈ హింసాకాండ చోటుచేసుకున్న సమయంలో ఆశిష్ మిశ్రా ఘటనా స్థలంలోనే ఉన్నారని సీట్ పేర్కొంది. ఈ హింస కేసులో ఆయనే ప్రధాన నిందితుడని తెలిపింది. ఈ చార్జీషీట్ లో ఆశిష్ మిశ్రా బంధువు పేరును కూడా చేర్చారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, ముందస్తుగా ప్రణాళిక ప్రకారమే చంపాలన్న ఉద్దేశంలో నిందితులు ఈ దారుణానికి పూనుకున్నారని సీట్ వెల్లడించింది.

 కేంద్ర మంత్రి పదవి రాజీనామాకు డిమాండ్..

కేంద్ర మంత్రి పదవి రాజీనామాకు డిమాండ్..

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఇప్పటికే అరెస్టు చేశారు. ఆయనతో సహా 13 మంది నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరేంద్ర శుక్లా అనే మరో వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 201 కింద అతనిపై అభియోగాలు నమోదు చేశారు సీట్ అధికారులు. లఖింపూర్ ఖేరి హింసాకాండ జరిగిన దాదాపు మూడు నెలలకు ఈ ఛార్జిషీటు నమోదు చేసింది సీట్. ఈ హింసాకాండలో సొంత కొడుకే నిందితుడిగా ఉండటంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+