రాహుల్ గాంధీని లండన్ కోర్టుకీడుస్తా-ట్విట్టర్ లో లలిత్ మోడీ హెచ్చరికలు..

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీని తాజాగా 2019 నాటి మోడీ వ్యాఖ్యల వివాదంలో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే లోక్ సభ సచివాలయం ఆయన్ను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించేసింది. ఆ తర్వాత రాహుల్ ను ఇల్లు ఖాళీ చేయాల్సిందిగా కేంద్రం నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన ఆయన ఇల్లు ఖాళీ చేస్తానని సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్రం, లోక్ సభ స్పీకర్ తీరుపై విమర్శలు వచ్చాయి .

రాహుల్ గాంధీ మోడీ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలుశిక్ష ఎదుర్కుంటున్న నేపథ్యంలో తాను కూడా రాహుల్ ను కోర్టుకీడుస్తానని భారత్ నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటున్న లలిత్ మోడీ హెచ్చరించారు. ట్విట్టర్ లో ఈ మేరకు ఆయన ఇవాళ వరుస ట్వీట్లు పెట్టారు. తాను ఏ కేసులోనుూ దోషిగా నిర్ధారణ కాలేదని, కానీ రాహుల్ దోషిగా నిర్ధారణ అయ్యారని మోడీ గుర్తుచేశారు. మోడీలంతా దొంగలేనంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను బ్రిటన్ కోర్టుకీడుస్తానని లలిత్ మోడీ హెచ్చరించారు.

lalit modi threatens rahul gandhi to sue in UK court over modi remarks

అంతటితో ఆగకుండా లలిత్ మోడీ రాహుల్ పై తీవ్ర విమర్శలకు దిగారు. పప్పు అనబడే రాహుల్ గాంధీ.. తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఓ కేసులో దోషిగా తేలారని, కానీ ఏ కేసులో దోషిగా తేలని తనను ఆర్ధిక నేరగాడు అంటున్నారని లలిత్ మోడీ విమర్శించారు. తానొక సాధారణ వ్యక్తినని, 100 బిలియన్ డాలర్ల విలువచేసే అతిపెద్ద కార్యక్రమానికి (ఐపీఎల్)కు ఆద్యుడిని అని గుర్తుచేశారు.

సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ పై లండన్ కోర్టులో దావా వేసేందుకు లలిత్ మోడీ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ బ్రిటన్ కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందని లలిత్ మోడీ చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రధాని మోడీతో కలిపి మోడీలంతా దొంగలేనంటూ తనపై చేసిన వ్యాఖ్యలపై లలిత్ మోడీ న్యాయపోరాటం చేసే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+