
బీజేపీ ముందు మోకరిల్లనందుకే.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు వేధింపులు: ప్రియాంక గాంధీ ఆరోపణలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, బీహార్ వ్యాఖ్యలపై తనను లక్ష్యంగా చేసుకుంటున్న బీజేపీపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను డోరాండా ట్రెజరీ నుంచి మోసపూరిత ఉపసంహరణ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. బీజేపీ ముందు మోకరిల్లనందుకే వేధింపులు ఎదుర్కొంటున్నారని ప్రియాంక ఆరోపించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రికి చివరికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకురాలు ఆశాభావం వ్యక్తం చేశారు.

'బీజేపీ బ్రాండ్ రాజకీయాలలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, (పార్టీ ముందు) తలవంచని వారు వేధింపులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో రాజీలేని మార్గాల కారణంగా దాడికి గురవుతున్నారు. న్యాయం జరుగుతుంది' అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
డోరండా
ట్రెజరీ
నుంచి
మోసపూరిత
ఉపసంహరణకు
సంబంధించిన
కేసులో
లాలూ
ప్రసాద్
యాదవ్‌ను
రాంచీలోని
సీబీఐ
ప్రత్యేక
కోర్టు
మంగళవారం
దోషిగా
నిర్ధారించింది.
గత
ఏడాది
ఏప్రిల్‌లో,
దాణా
కుంభకోణానికి
సంబంధించిన
కేసుల్లో
ఒకటైన
దుమ్కా
ట్రెజరీ
నుంచి
మోసపూరిత
ఉపసంహరణ
కేసులో
ఆర్జేడీ
చీఫ్‌కు
జార్ఖండ్
హైకోర్టు
బెయిల్
మంజూరు
చేసింది.
లాలూ గతంలో అక్టోబర్ 2020లో చైబాసా ట్రెజరీ స్కామ్ కేసులో, ఫిబ్రవరి 2020లో డియోఘర్ ట్రెజరీ స్కామ్ కేసులో బెయిల్ పొందారు. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 1991, 1996 మధ్యకాలంలో పశుసంవర్ధక శాఖ అధికారులు దుమ్కా ట్రెజరీ నుంచి రూ.3.5 కోట్లను మోసపూరితంగా విత్‌డ్రా చేసిన కేసుకు సంబంధించినది.
ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా నిర్ధారించడంపై బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇకపై లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడిన సుశీల్ మోడీ.... ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది మేమే. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ పాట్నా హైకోర్టును ఆశ్రయించాం. బీహార్‌ను దోచుకున్న వారికి శిక్ష పడటం సంతోషంగా ఉంది. బీహార్ రాజకీయాలకు సంబంధించి లాలూ యాదవ్ ఇక లేరు" అని వ్యాఖ్యానించారు. డిఫెన్స్ న్యాయవాది సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారుపై విచారణ ఫిబ్రవరి 21 (సోమవారం) రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతుందని ఏఎన్ఐ నివేదించింది.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ.. పంజాబ్‌లోకి ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ భయ్యాలను (సోదరులను) రానివ్వొద్దంటూ ప్రజలను కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ పంజాబీల కోడలని అన్నారు. చన్నీ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో ప్రియాంక ఆయన పక్కనే ఉండి చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. దీనిపై ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. 'చన్నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు. వ్యక్తులను, కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకొని ఇలా మాట్లాడటాన్ని ఖండిస్తున్నా' అని అన్నారు. యూపీ ప్రచారంలో ఉన్నప్పుడు ప్రియాంక తనకు తానుగా యూపీ బిడ్డగా చెప్పుకొంటారని, అయితే, పంజాబ్‌లో యూపీ, బీహార్ పౌరులు అవమానానికి గురైతే ఆమె చప్పట్లు కొడుతున్నారని బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య, సహా బీజేపీ నేతలు మండిపడ్డారు.