అద్దె ఇంట్లో ఉన్నారా..ఈ కథ చదవాల్సిందే, చివర్లో ట్విస్ట్ మిస్ కాకండి..!!

కోయంబత్తూరు: సాధారణంగా అద్దెకు ఇళ్లు తీసుకుని ఉంటున్నవారు, ఎక్కడికైనా బయటికో లేదా మరో ఊరికో, తీర్థయాత్రలకో వెళ్లే సమయంలో ఇంటికి గట్టిగా తాళాలు వేసి ఆ ఇంటి యజమాని(ఓనరు)కు తాళం చెవి ఇవ్వడమా.. లేక ఇంటిపై ఓ కన్నేసి ఉంచడంటూ చెప్పి వెళ్లడమా జరుగుతుంది. ఇదంతా జాగ్రత్త చర్యల్లో భాగంగా జరిగిపోతుంది. అయితే కోయంబత్తూరులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి భార్యతో కలిసి ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఈ కథలో ట్విస్ట్ ఒకటుంది.

కోయంబత్తూరులోని గణపతి కుమారన్ నగర్‌లో శ్రీహరి అనే వ్యక్తి భార్యతో కలిసి ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నాడు. ఆ ఇంటికి యజమాని 43 ఏళ్ల కృష్ణన్. శ్రీహరి చెన్నైలో ఓ టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కోయంబత్తూరులోని ఇంటి నుంచే తాను పని చేస్తున్నాడు. శ్రీహరి గత నెలలో భార్యతో కలిసి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. ఊరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత శ్రీహరి దంపతులు షాక్‌కు గురయ్యారు. వేసిన తాళం వేసినట్లే ఉంది కానీ.. బీరువాలో 15 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి.

Landlord Turned Thief Shocking Gold Heist from Tenants Home in Coimbatore

అయితే బంగారం మాయమవడంపై ఆందోళన చెందిన శ్రీహరి, తన తల్లిదండ్రుల ఇంట్లో ఏమైనా మర్చిపోయి వచ్చామా అని గుర్తుచేసుకున్నాడు. కానీ అసలు బంగారం తనతో పాటు తీసుకెళ్లలేదని గుర్తించాడు. ఇక దొంగ ఎవరై ఉంటారా అని ఆలోచించసాగాడు. మరోసారి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని భావించి తన ఇంట్లో టేబుల్ పై 14 గ్రాముల బంగారం గొలుసు ఉంచి వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే టేబుల్ పై ఉన్న బంగారు గొలుసు కనిపించలేదు.

ఇంట్లో నగలు పదే పదే చోరీకి గురికావడంతో శ్రీహరికి అనుమానం వచ్చింది.ఇక దొంగను పట్టుకునేందుకు మంచి పథకం వేశాడు. ముందుగా ఇంట్లో ఓ సీక్రెట్ కెమెరాను అమర్చాడు. ఆ తర్వాత 13 గ్రాముల కడియాలు, 6 గ్రాముల బంగారం ఉంగరం ఇంట్లో ఉంచి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లొస్తానంటూ ఇంటికి తాళం వేసి పోయారు శ్రీహరి దంపతులు. ఇక ఈ సారి కూడా నగలు కనిపించలేదు.ఇక ఇంట్లో అమర్చిన సీక్రెట్ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను చూసి శ్రీహరి దంపతులు నిర్ఘాంతపోయారు.

శ్రీహరి తన ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిన తర్వాత ఇంటి యజమాని కృష్ణన్ తన వద్ద ఉన్న తాళంతో ఇంటి తాళం తెరచి అక్కడి నుంచి బంగారు నగలు అపహరించే దృశ్యాలు సీక్రెట్ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక దొంగ దొరకడంతో వీడియో ఫుటేజీలను పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అద్దెకుంటున్న శ్రీహరి ఇంట్లో లేని సమయంలో యజమాని కృష్ణన్ చోరీకి పాల్పడటం రుజువు కావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు దొంగలించిన నగలు కూడా రికవరీ చేసి శ్రీహరికి ఇచ్చారు.

మొత్తానికి ఇంటి యజమానే దొంగగా మారడంతో అవాక్కయ్యారు పోలీసులు. ఇక నుంచి అద్దెకు ఇళ్లల్లో ఉంటున్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఊరు వెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇంటి యజమానులను కూడా నమ్మడానికి వీలు లేదని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పోయిన నగలు తిరిగి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు శ్రీహరి దంపతులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+