వర్ష బీభత్సం: విరిగిపడిన కొండచరియలు; గ్రామం మొత్తం సమాధి!!
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఇప్పటికే యమునా నది వరదలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయ్యింది. ఇక తాజాగా మహారాష్ట్ర ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్ర లోని రాయగడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి గిరిజన కు గ్రామం 30కి పైగా కుటుంబాలు శిధిలాల క్రింద చిక్కుకున్నాయి.
రాయగడ్ జిల్లాలోని గిరిజన కుగ్రామమైన ఇర్షాల్ వాడిలో అర్ధరాత్రి కొండ చరియలు విరిగిపడడంతో నలుగురు మృతి చెందగా పలువురు శిధిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ చరియలు విరిగి పడినట్టుగా తెలుస్తుంది. గ్రామంలో గిరిజనులకు చెందిన 46 ఇళ్ళు ఉన్నాయని, అందులో నాలుగైదు ఇళ్ళు మినహాయించి మిగతా అన్ని ఇళ్ళు కొండ చరియలు విరిగిపడడంతో సమాధి అయ్యాయని చెప్తున్నారు.

ఇప్పటివరకు శిథిలాల కింద ఉన్న 25 మందిని రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా నలుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి శిధిలాలను తొలగిస్తున్నారు. కొన్నిచోట్ల శిథిలాలు 10 నుండి 29 అడుగుల లోతులో ఉన్నాయని, సంఘటన స్థలానికి భారీ యంత్రాలను తీసుకురావడం కష్టంగా మారిందని ఎన్టీఆర్ అధికారులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. ఘటన స్థలికి సమీపంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మరో రెండు బృందాలను కూడా సంఘటనా స్థలానికి పంపిస్తున్నారు .
వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు అవాంతరాలు కలుగుతున్నాయి. ఈరోజు కూడా ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుతం అక్కడ స్థానికులు,స్వచ్చంద సంస్థల సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications