Leader: పార్టీ మారడానికి సిద్దం అయిన కుల సంఘం నాయకుడు, మర్మాంగం ఛట్నీ చేసి చంపేశారు !
బెంగళూరు/సేడం: ఓ నియోజక వర్గంలో ఓ కులానికి చెందిన వారు లక్షల మంది ఉన్నారు. కుల సంఘం తాలుకా గౌరవాధ్యక్షుడిగా ఓ వ్యాపారి ఉన్నారు. ప్రాంతీయ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న ఆ కుల సంఘం నాయకుడు ఇటీవల జాతీయ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అయ్యారు. కుల సంఘం నాయకుడి ఎలక్ట్రికల్ షాప్ ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. సాయంత్రం వ్యాపారం చేసిన ఆయన రాత్రి షాపులోనే నిద్రపోయాడు. అర్దరాత్రి కొందరు వ్యక్తులు షాపులోకి వెళ్లి ఆ కుల సంఘం నాయకుడి మర్మాంగం పచ్చడి చేసి గొంతుకు టవల్ బిగించి హత్య చెయ్యడం కలకలం రేపింది. మంత్రి సమక్షంలో త్వరలో వేరే పార్టీలోకి మారడానికి సిద్దం అయిన కుల సంఘం నాయుకుడిని అతిదారుణంగా హత్య చెయ్యడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

కుల సంఘం నాయకుడు
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో కోలి కులానికి చెందిన ఓటర్ల లక్షల మంది ఉన్నారు. కోలి కులంలోని కొందరు నాయకులు బీజేపీ, కాంగ్రేస్, జేడీఎస్ పార్టీలలో ఉన్నారు. కలబురిగి జిల్లాలోని సేడం తాలుకా కోలి కుల సంఘం గౌరవాధ్యక్షుడిగా మల్లికార్జున ముత్యాల అలియాస్ మల్లికార్జున (65) పని చేస్తున్నారు.

సేడంలో షేమస్ షాపు
మల్లికార్జున ముత్యాలకు సేడం పట్టణంలో చాలా పెద్ద ఎలక్ట్రికల్ షాపు ఉంది. మల్లికార్జున ముత్యాలతో పాటు ఆయన కుమారుడు వెంకటేష్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారి మల్లికార్జున ముత్యాల కోలి కులంలోని పేదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోలి కుల సంఘం సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా తన అనుచరులతో కలిసి మల్లికార్జున ముత్యాల వెళ్లేవారు.

జేడీఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లాలని !
ప్రాంతీయ పార్టీ జేడీఎస్ లో చురుకుగా పనిచేస్తున్న కోలి కుల సంఘం నాయకుడు మల్లికార్జున ముత్యాల ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అయ్యారు. సోమవారం ప్రభుత్వ పథకాల కోసం నిర్వహించిన బీజేపీ కార్యక్రమానికి మల్లికార్జున ముత్యాల హాజరైనారు. మల్లికార్జున ముత్యాల బీజేపీలో చేరడానికి ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కుల సంఘం నాయకుడి మర్మాంగం చట్నీ చేసి హత్య
కోలి కుల సంఘం నాయకుడు మల్లికార్జున ముత్యాల ఎలక్ట్రికల్ షాప్ లో రాత్రి వరకు వ్యాపారం చేసి రాత్రి షాపులోనే నిద్రపోయాడు. అర్దరాత్రి కొందరు వ్యక్తులు షాపులోకి వెళ్లి మల్లికార్జున ముత్యాల మీద దాడి చేసి ఆయన మర్మాంగం పచ్చడి చేసి గొంతుకు టవల్ బిగించి హత్య చెయ్యడం కలకలం రేపింది.

ఎన్నికల సమీపిస్తుంటే ?
ఓ మంత్రి సమక్షంలో త్వరలో వేరే పార్టీలోకి మారడానికి సిద్దం అయిన కోలి కుల సంఘం నాయుకుడు మల్లికార్జున ముత్యాలను అతిదారుణంగా హత్య చెయ్యడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. త్వరలో కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో చాలా మంది పార్టీలు మారుతున్నారు. ఇలాంటి సమయంలో కలబురిగి జిల్లాలో ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న కోలి కుల సంఘం నాయకుడు హత్యకు గురికావడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications